నమ్మించి.. వంచించారు... | Married women raped | Sakshi
Sakshi News home page

నమ్మించి.. వంచించారు...

Published Sat, Nov 21 2015 12:44 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Married women raped

వివాహితపై ఏఎస్‌ఐ, అతని బావమరిది అత్యాచారం

బెల్లంకొండ

ఓ మహిళ అవసరాన్ని ఆసరా చేసుకుని ఆమెకు మత్తుమందిచ్చి ఓ ఏఎస్‌ఐ, అతని బావమరిది అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం మేరకు... జిల్లాలోని అచ్చంపేట మండలం కొత్తపల్లికి చెందిన ఓ వివాహిత(28) కు మూడెకరాల పొలం ఉంది. పొలంలో బోరు వేయించే యోచనలో ఉండటంతో.. ఆదే గ్రామానికి చెందిన మందపాటి శ్రీను ఆమెతో మాటలు కలిపాడు.


తన బావ శ్రీనివాసరావు పిడుగురాళ్ల ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడని, విద్యుత్ కనెక్షన్ సులభంగా ఇప్పిస్తానని చెప్పి ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మందపాటి శ్రీను, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. ఈ అరాచకాన్ని వీడియో తీశామని, భర్తకు చూపిస్తామంటూ ఆమెను బెదిరిస్తుండడంతో బాధితురాలు ఐదు రోజుల క్రితం రూరల్ ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు బెల్లంకొండ పోలీసు అధికారుల తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement