నెల్లూరు (కలెక్టరేట్),న్యూస్‌లైన్: జిల్లాలో రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 29 మంది తహశీల్దార్లను గుంటూరు, ప్రకాశం జిల్లాలకు బదిలీ చేస్తూ మంగళవారం కలెక్టర్ శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో 20 మంది గుంటూరుకు తొమ్మిది మంది ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరుకు బదిలీ అయిన వారిలో నెల్లూరు తహశీల్దార్ నరసింహులు, వెంకటాచలం తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, పొదలకూరు తహశీల్దార్ రామకృష్ణ, గూడూరు తహశీల్దార్ మైత్రేయ, విడవలూరు తహశీల్దార్ కేవీ రమణయ్య, ఆత్మకూరు తహశీల్దార్ వెంకటేశ్వర్లు, అనుమసముద్రం తహశీల్దార్ రామాంజనేయులు, తడ తహశీల్దార్ మునిలక్ష్మి, వింజమూరు తహశీల్దార్ కృష్ణారావు, కావలి ఆర్‌డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న రత్నశేఖర్, అల్లూరు తహశీల్దార్ ఉమాదేవి, దగదర్తి తహశీల్దార్ జయప్రకాష్, గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.వరకుమార్, కోట తహశీల్దార్ చిన్నయ్య, వాకాడు తహశీల్దార్ బి.వెంకట శ్రీనివాసులు, సైదాపురం తహశీల్దార్ కె.భాస్కర్, చిట్టమూరు తహశీల్దార్ శ్రీనివాసులు, కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు, డక్కిలి తహశీల్దార్ ఎం. చెంచుకృష్ణమ్మ, నాయుడుపేట తహశీల్దార్ పి. జనార్దన్‌రావు ఉన్నారు.
అలాగే ప్రకాశం జిల్లాకు బదిలీ అయిన వారిలో తోటపల్లి గూడూరు తహశీల్దార్ ఎస్. రేవతి, ముత్తుకూరు తహశీల్దార్ సుశీల, కోవూరు తహశీల్దార్ సాంబశివరావు, కొడవలూరు తహశీల్దార్ ఎ.శ్రీశిల్ప, చేజర్ల తహశీల్దార్ బి.లీలారాణి, సంగం తహశీల్దార్ ఎస్.శ్రీకాంత్, బాలాయపల్లి తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, సూళ్లూరుపేట తహశీల్దార్ ఎం.రోజ్‌మాండ్, కలెక్టరేట్ ఏఓగా పనిచేస్తున్న మధుసూదన శర్మ ఉన్నారు.
రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు
Published Wed, Feb 12 2014 3:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement