మల్లాపూర్, న్యూస్‌లైన్ : రాజకీయ ప్రయోజన మే పరమావధిగా మారింది. నాయక గణాన్ని పెంచుకోవడమే లక్ష్యం అయ్యింది. ‘సేవా తత్పరత’ ప్రాతిపదికన జరగాల్సిన నియామకంలో ‘వేలం’ స్థానం సంపాదించింది. వెర్రి గా మారింది.
మండలంలోని రేగుంట పరిధిలో 1221 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. అటవీ రక్షణ కోసం 1995-96 ఆర్థిక సంవత్సరంలో ‘వన సంరక్షణ సమితి’ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు బాధ్యతలు నిర్వహించిన కమిటీ కాలపరిమితి 2013 మా ర్చిలో ముగియడంతో మళ్లీ కమిటీని నియమించాల్సి ఉంది. ఈ అవకాశాన్ని వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమకు అనుకూలం గా మార్చుకున్నారు. ‘వేలం వెర్రి’ పథకాలు రూపొందించారు. కుల సంఘాల నుంచి కమిటీ సభ్యులను ఎన్నుకొనే ప్రక్రియ జరగాల్సి ఉంది. రాజకీయ పక్షాలు తమకు అనుకూలమైన వ్యక్తుల ఎన్నిక కోసం కార్యాచరణ ఏర్పరచుకున్నారు. ‘సేవా తత్పరత ప్రాతపది క’న సభ్యులను నియమించాల్సి ఉండగా, ఇం దుకు భిన్నంగా వేలం పాట నిర్వహించారు.
అదనపు ఆదాయం వస్తుండడంతో కుల సం ఘాలు కూడా ఆమోదం తెలిపాయి. గీత కార్మి క సంఘం రూ.18వేలు, విశ్వబ్రాహ్మణ కుల సంఘం రూ.12వేలు, మున్నూరు కాపు సం ఘం రూ.15వేలు, గుడేటికాపు సంఘం రూ. 34వేలు, పద్మశాలి సంఘం రూ.12వేలు, కు మ్మరి సంఘం రూ.15వేలు, దూదేకుల సం ఘం రూ.14వేలు,రజక సంఘం రూ.12వేలు, ముదిరాజ్ సంఘం రూ.12వేలకు వేలం పాడి కమిటీలో సభ్యులను నియమించుకున్నట్లు తెలిసింది. ఈ వేలంతో రూ.1.33లక్షల ఆదా యం వచ్చినట్లు చెబుతున్నారు. మరో 5 సంఘాల్లో వేలం వేయనున్నట్లు సమాచారం. అధ్యక్ష స్థానికి రూ.2లక్షలు పలుకనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరించే ఈ ఘటనపై ఎవరూ పెదవి విప్పడంలేదు.
వీఎస్‌ఎస్ పదవులకు వేలం
Published Sat, Nov 9 2013 3:39 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement