సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు విభృంభించాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సింది పోయి అచేతనంగా ఉండడాన్ని సీపీఎం ఏపీ కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. కలుషిత జలాలు, తాగునీటి కొరత, దోమలతో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్ వ్యాపించాయని, వ్యాధుల నివారణకు ప్రభుత్వం వెంటనే వైద్య శిబిరాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ మందులు, సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.