ఎస్వీయూ రీజియన్‌కు అన్యాయం జరిగిందని ఆందోళన
కౌన్సెలింగ్‌కు అంతరాయం
పద్మావతి మెడికల్ కళాశాల సీట్లను ఏయూ రీజియన్‌కు కేటాయించారని ఆరోపణ
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో జరుగుతున్న వైద్యవిద్య కౌన్సెలింగ్‌లో గురువారం గందరగోళం చోటుచేసుకుంది. తిరుపతిలో ని పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లను ఎస్వీయూ రీజియన్‌కు కేటాయించకుండా, ఆంధ్రా యూనివర్సిటీకి అలాట్ చేశారని ఆరోపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫలితంగా మెడిసిన్ కౌన్సెలింగ్ ఆగిపోయింది. ఎస్వీయూలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సర్వర్ పనిచేయకుండా చేసి, ఏయూ రీజియన్‌కు సీట్లను కట్టబెట్టారని వారు ఆరోపించా రు. అయితే అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని చెబుతున్నారు. రాత్రి 10.45 గంటల తరువాత తిరిగి కౌన్సెలింగ్ ప్రారంభమయింది. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశానికి బుధవారం కౌన్సెలింగ్ ప్రా రంభమైంది.
ఇందులో భాగంగా గురువారం 1001 నుంచి 4వేల ర్యాంక్ వర కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే పద్మావతి మెడికల్ కళాశాలకు సంబంధించిన సీట్ల కేటాయింపుపై గందరగో ళం నెలకొంది. ఎస్వీయూ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కంప్యూటర్ సర్వర్ పనిచేయలేదు. సర్వర్ నిలిచిపోయిన సమయానికి ముందు పద్మావతి మెడికల్ కళాశాలలో ఓపెన్ కేటగిరిలో 44 సీట్లు అందుబాటులో ఉన్నట్లు డిస్‌ప్లేలో కన్పించింది. అప్పుడు 1630 ర్యాంక్ వరకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. తిరిగి 2 గంటలకు కౌన్సెలింగ్ పునఃప్రారంభమైన సమయంలో పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లు లేనట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించారు. అప్పటికి ఓపెన్ కేటగిరీలో 2003 ర్యాంక్‌కు సీట్లు కేటాయించారు.
ఆ 44 సీట్లు ఏమయ్యాయి
సర్వర్ ఆగిపోవడానికి ముందు పద్మావతి మెడికల్ కళాశాలలో కన్పించిన 44 సీట్లు సర్వర్ పునరుద్ధరించే సమయానికి కన్పించకుండా పోయాయని, ఆ సీట్లు ఏమయ్యాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను నిలిపి వేశారు. స్విమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో ఉన్న 127 సీట్లు ఎస్వీయూ రీజియన్‌కే చెందాలని చెప్పారు. ఆ సీట్లన్నీ ఏయూ రీజి యన్‌కు కట్టపెట్టి, తమను మోసగించారని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించా రు. ఆ44 సీట్లు ఏమయ్యాయని ప్రశ్నిం చారు. కౌన్సెలింగ్ రద్దు చేసి రీకౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగష్టు 23న విడుదల చేసిన జీవో 120 ప్రకారం పద్మావతి మె డికల్ కళాశాలలోని 127 సీట్లు రా ష్ట్రంలోని 13 జిల్లాల వారికి చెందుతాయ ని చెప్పారు. ఎస్వీ యూ రీజియన్ వా రికి అన్యాయం జరగలేదని సర్దిచెప్పా రు. అయితే న్యాయ పోరాటం చేస్తామని వారు వెళ్లిపోవడం తో కౌన్సెలింగ్ తిరిగి ప్రారంభించారు.
మెడిసిన్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
Published Fri, Aug 7 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement