రాష్ట్ర విభజనపై ‘సుప్రీం’లో ఎంపీ మేకపాటి పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక, రాజ్యాంగ విధానాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ మేకపాటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.