మినరల్ వాటర్ ప్లాంట్‌పై దాడి
Published Thu, Feb 6 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల పారిశ్రామికవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్‌పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(విశాఖపట్నం) అధికారులు బుధవారం దాడి చేశారు. 100 వాటర్ ప్యాకెట్ల బస్తాలను, 20 కేన్లను సీజ్ చేశారు. స్థానిక మహమ్మద్ షమీ మినరల్ వాటర్ ప్లాంట్‌లో వాటర్ ప్యాకెట్లు, క్యాన్లు, బాటిల్స్‌ను లూలు, మూన్‌లైట్, ఎంవీఆర్ పేర్లతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించ డం లేదన్న కోర్టు ఆదేశాలతో అధికారులు గతంలోనే ప్లాంట్‌ను సీజ్ చేశారు. అయితే యాజమాన్యం అనధికారికంగా ప్లాంట్‌ను నిర్వహిస్తూ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది.
సమాచారం తెలుసుకున్న అధికారులు పక్కాగా దాడి చేసి ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎస్‌ఐ డెరైక్టర్ ఎంవీఎస్ ప్రసాదరావుమాట్లాడుతూ యాజమాన్యం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఉత్పత్తి చేస్తోందన్నారు. నీటిని శుద్ధి చేయకుండా ప్యాకెట్లు, క్యాన్లు, బాటిల్స్‌ను తయారు చేస్తున్నారని తెలిపారు. ఉత్పత్తులపై ఐఎస్‌ఐ ముద్రలను సైతం వేసి నేరానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నీటిని వినియోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. యాజమాన్యంపై వైద్య, ప్రజారోగ్యశాఖలకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడిలో ఐఎస్‌ఐ అధికారులు వి.షణ్ముగం, వి. శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
అంతా అనధికారికం..
జిల్లా వ్యాప్తంగా సుమారు 400 వరకు మినరల్ వాట ర్ ప్లాంట్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు 100 ప్లాంట్ల కు మాత్రమే అనుమతి ఉన్నట్లు సమాచారం. చాలా ప్లాంట్లలో కనీస స్థాయిలో కూడా నాణ్యతా ప్రమాణా లు పాటించడం లేదు. జిల్లాలో తాగునీటి వ్యాపారం రోజుకు సుమారు 50 నుంచి 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నెలకు కోట్లలో జరిగే వ్యాపారంపై సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై కొరడా ఝులిపించాలని వారు కోరుతున్నారు.
Advertisement
Advertisement