Mineral water plant
-
మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎంపీ
-
మినరల్ వాటర్ తియ్యగా ఉండొద్దు..
కలెక్టర్ రోనాల్డ్‌రాస్ పటాన్చెరు/రామచంద్రాపురం: కలెక్టర్ రోనాల్డ్‌రాస్ శనివారం పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్చెరు పట్టణంలోని రామేశ్వరంబండలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైల్వే భూములను పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిమిత్తం కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి కోరారు. విషయాన్ని పరిశీలిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రామచంద్రాపురం పట్టణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు కొనుగోలు చేసిన ట్యాంకర్లను కలెక్టర్ ప్రారంభించారు. తమ సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించనున్నట్టు వారు కలెక్టర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాటర్ ట్యాంకర్‌ను నడిపారు. అనంతరం ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీలో కలెక్టర్ మినరల్ వాటర్‌ప్లాంటు పనులను ప్రారంభించారు. నీళ్లు తియ్యగా ఉంటాయా.. రామచంద్రాపురం : ఈ నీళ్లు తీయ్యగా ఉంటాయా.. అవును సార్.. అయితే ఈ నీళ్లు ప్రజలకు అవసరం లేదు. అన్నారు కలెక్టర్.. ఈ సంభాషణ పట్టణంలోని భారతీనగర్ కాలనీ మినరల్ వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుణ్ని ప్రశ్నించారు. భారతీనగర్‌లోని మినరల్ వాటర్ ప్లాంటు పనితీరును కలెక్టర్ పరిశీలించారు. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకుణ్ని ప్లాంటు ఏ విధంగా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నారు. నీళ్లు తియ్యగా ఉంటాయా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో నిర్వాహకులు అవును సార్ తియ్యగా ఉంటాయని చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎక్కువ తియ్యగా ఉంటే మంచిది కాదని నిర్వాహకులకు తెలిపారు. బోరు నుంచి తీసిన నీటిని శుద్ధి చేసి తగిన మోతాదులో మినరల్ కలిపితే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుజల కష్టాలు
సుజల స్రవంతి పథకం జిల్లా అధికారులకు, పరిశ్రమలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. పథకానికి నిధులివ్వకుండా సర్కార్ తప్పించుకోవడంతో ఆ భారం వీరిపై పడ్డంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను ఒప్పించాల్సిన బాధ్యత ఉండడంతో ఏంచేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమపై నెట్టడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : సుజల స్రవంతి పథకానికి అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. రూ.2 కే 20లీటర్లు ఇచ్చే ఈ పథకానికి అవసరమయ్యే మినరల్వాటర్ప్లాంట్లను ప్రభుత్వం కొనుగోలుచేయకుండా వాటిని సేకరించాల్సిన బాధ్యతను జిల్లాకలెక్టర్లపైనే పెట్టింది. ప్లాంట్ల కొనుగోలుకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రముఖ పరిశ్రమలు,కంపెనీలే భరించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్‌తోపాటు గ్రామీణ నీటిసరఫరా, జిల్లా పరిశ్రమలశాఖ తల పట్టుకుంటున్నాయి. దాతల రూపంలో ఒక్కో కంపెనీకి ఒక్కో గ్రామాన్ని అప్పగించి వారిచేత ప్లాంట్లు కొనుగోలు చేయించడం వీరి పని. అయితే ఇప్పుడు ఆచరణలో తలెత్తుతోన్న ఇబ్బందులతో వీరంతా అగచాట్లు పడుతున్నారు. ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా ఒక్కోప్లాంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.10లక్షవరకు ఉంటోంది. కంపెనీల వెంట అధికారులు పరుగులు తీస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహించి గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ ప్లాంట్ పెట్టే బాధ్యత కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో చాలా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతేడాదిగా వరుసగా సమైక్య ఉద్యమం, వరుస విద్యుత్‌కోతలు, ఆర్డర్లు లేకపోవడం, బ్యాంకురుణాలు చెల్లించలేక ఆర్థికసంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు రాకపోవడంతో చాలా పరిశ్రమలు రకరకాల కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో సుజల స్రవంతి పథకానికి తాము ప్లాంట్లు కొనివ్వలేమని ఖరాఖండీగా చెబుతున్నాయి. మరికొన్నయితే అధికారుల నుంచి తర్వాత ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఆర్థికంగా కష్టమైనా మౌనంగా భరిస్తున్నాయి. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లను కొనుగోలు చేసి ఇవ్వకపోతే ఆతర్వాత ప్రోత్సాహకాల పరంగా సర్కార్ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయేమోనని భయపడుతున్నాయి. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకురాగా, విశాఖడెయిరీ కూడా వాటర్ప్లాంట్లు కొనుగోలుకు సహకరించాలని నిర్ణ యించింది. చాలాపెద్దగ్రామాలు ఉండిపోవడం..అధికారులు అదేపనిగా కొన్ని ప్రైవేటు కంపెనీలను అడుగుతుంటే అవి మాత్రం తమను వదిలేయండంటూ మొరపెట్టుకుంటుండడం విశేషం. -
గ్రామానికో రూ.2కోట్లు.. జిల్లాకు రూ.4,014 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మా ఊళ్లో వీధులన్నీ సీసీ రోడ్లు చేయాలి. సీసీ డ్రైనేజీలు నిర్మించాలి. రక్షిత మంచినీటిని అందించేందుకు బోరు.. వాటర్ ట్యాంక్ నిర్మించాలి. పైపులైన్లు వేయాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. చెర్వుకు మరమ్మతులు చేయాలి. పూడిక తీయాలి. కాల్వలు పునరుద్ధరించాలి. పాఠశాలలో టాయిలెట్లు, అదనపు గదులు నిర్మించాలి. ప్రహరీ గోడ కట్టాలి. ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన విన్నపాల్లో ప్రధాన అంశాలివే. వీటిని సమకూర్చేందుకు సగటున ఒక్కో పల్లెలో ఎంత ఖర్చు అవుతుంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షేత్ర స్థాయి ప్రణాళికలను అమలు చేసేందుకు మన జిల్లాకు ఎంత బడ్జెట్టు కావాలి... అనే అంచనాలు రూపు దిద్దుకుంటున్నాయి. వరుసగా గ్రామసభల్లో వచ్చిన విన్నపాలను అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సర్కారు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్య క్రమం లో మూడు ప్రతిపాదనలను ఆన్లైన్లో పొందు పరుచనున్నారు. రమారమి వీటికి ఎంత ఖర్చు అవుతుంది... అని మండల స్థాయిలో అధికారులు అంచనా వ్య యాన్ని నమోదు చేస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన డిమాండ్ల ప్రకారం ఒక్కో గ్రామానికి సగటున రూ.2 కోట్లు కావాలని అంచనా వేశారు. పెద్ద గ్రామాల్లోని అవసరాలకు దాదాపు రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని గుర్తించారు. జిల్లాలో మొతం్త 1207 పంచాయతీలున్నాయి. ఈ లెక్కన జిల్లాకు కనీసం రూ.4014 కోట్ల బడ్జెట్టు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా. గ్రామ ప్రణాళికలన్నీ క్రోడీకరించిన అనంతరం జిల్లా ప్రణాళిక తయారీ చేస్తారు. దీంతో జిల్లాకు ఎంత బడ్జెట్టు అవసరమవుతుందనేది పక్కాగా లెక్కతేలుతుంది. క్షేత్రస్థాయి అంచనాలు చిన్న గ్రామమైతే కనీసం వెయ్యి మీటర్ల సీసీ రోడ్డు వేయాలి. ఇంజినీరింగ్ అధికారుల అంచనా ప్రకారం ఒక్కో మీటర్‌కు రూ.3000 ఖర్చు అవుతుంది. సీసీ మురికి కాల్వ నిర్మాణానికి ఒక్కో మీటర్‌కు రూ.2000 ఖర్చు. నలభై వేల లీటర్ల సామర్థ్యముండే తాగునీటి పథకానికి రూ.20 లక్షలు, 60 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌కు రూ.27 లక్షలు, పైపులైన్లు, బోర్‌కు రూ.20 లక్షలు అవసరమవుతాయి. పూడికతీత, కట్టకు మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్, తూములు, షట్టర్ల మరమ్మతులు.. మొత్తంగా చెరువు అభివృద్ధికి కనీసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు అవసరం. ఇదే తీరుగా ప్రత్యేక విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాలకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఒక్కో పంచాయతీకి సగటున రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమున్నట్లు మండల స్థాయి అధికారులు లెక్క గట్టారు. నేటితో ఆఖరు శుక్రవారం నాటికి జిల్లాలో 1200 గ్రామాల్లో సభలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో మిగిలిన అయిదు గ్రామాలు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మిగిలిన రెండు గ్రామాల్లో శనివారం సభలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సుల్తానాబాద్ మండలంలో ఈ ప్రణాళికల తయారీలో పాలుపంచుకున్నారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం తన నియోజకవర్గంలో జరిగే సభలకు హాజరవనున్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను మరో నాలుగు రోజుల్లో ఆన్లైన్లో నమోదు చేసి.. తదుపరి జిల్లా ప్రణాళికను సిద్ధం చేస్తారు. ప్లాన్ 2005 గ్రామ ప్రణాళికలను మండలంలో.. మండల ప్రణాళికలను జిల్లాలో... జిల్లా ప్రణాళికలను రాష్ట్ర స్థాయిలో ఆమోదించి బడ్జెట్టు రూపకల్పన చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టింది. 2005లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆగమేఘాలపై వీటిని రూపొందించి స్పైరల్ బైండిగ్ చేయించి కట్టలు కట్టారు. కానీ.. అప్పటి ప్రభుత్వం వీటికి తగిన ప్రాధాన్యమివ్వకపోవటంతో అధికారుల స్థాయిలోనే అవి అటకెక్కాయి. దీంతో కేసీఆర్ ప్రయత్నం క్షేత్రస్థాయిలోనే ఆగిపోయింది. ఇప్పుడు నవ తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అప్పటి తన ఆలోచనకు మరింత పదునుపెట్టి రాష్ట్రస్థాయికి విస్తరించారు. దీంతో భవిష్యత్తు నిధుల కేటాయింపులో ఈ ప్రణాళికల ప్రాధాన్యం కీలకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మినరల్ వాటర్ ప్లాంట్‌పై దాడి
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల పారిశ్రామికవాడలో అనధికారికంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్‌పై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(విశాఖపట్నం) అధికారులు బుధవారం దాడి చేశారు. 100 వాటర్ ప్యాకెట్ల బస్తాలను, 20 కేన్లను సీజ్ చేశారు. స్థానిక మహమ్మద్ షమీ మినరల్ వాటర్ ప్లాంట్‌లో వాటర్ ప్యాకెట్లు, క్యాన్లు, బాటిల్స్‌ను లూలు, మూన్లైట్, ఎంవీఆర్ పేర్లతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించ డం లేదన్న కోర్టు ఆదేశాలతో అధికారులు గతంలోనే ప్లాంట్‌ను సీజ్ చేశారు. అయితే యాజమాన్యం అనధికారికంగా ప్లాంట్‌ను నిర్వహిస్తూ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు పక్కాగా దాడి చేసి ఉత్పత్తులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎస్ఐ డెరైక్టర్ ఎంవీఎస్ ప్రసాదరావుమాట్లాడుతూ యాజమాన్యం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఉత్పత్తి చేస్తోందన్నారు. నీటిని శుద్ధి చేయకుండా ప్యాకెట్లు, క్యాన్లు, బాటిల్స్‌ను తయారు చేస్తున్నారని తెలిపారు. ఉత్పత్తులపై ఐఎస్ఐ ముద్రలను సైతం వేసి నేరానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నీటిని వినియోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. యాజమాన్యంపై వైద్య, ప్రజారోగ్యశాఖలకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడిలో ఐఎస్ఐ అధికారులు వి.షణ్ముగం, వి. శాంతారావు తదితరులు పాల్గొన్నారు. అంతా అనధికారికం.. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 వరకు మినరల్ వాట ర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో సుమారు 100 ప్లాంట్ల కు మాత్రమే అనుమతి ఉన్నట్లు సమాచారం. చాలా ప్లాంట్లలో కనీస స్థాయిలో కూడా నాణ్యతా ప్రమాణా లు పాటించడం లేదు. జిల్లాలో తాగునీటి వ్యాపారం రోజుకు సుమారు 50 నుంచి 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నెలకు కోట్లలో జరిగే వ్యాపారంపై సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై కొరడా ఝులిపించాలని వారు కోరుతున్నారు.