అనంతపురం: మైనింగ్ మాఫియా రోజురోజుకు పేట్రేగిపోతోంది. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఉడమలకుర్తి గ్రామ సమీపంలోని గుండ్రాజులకొండను తవ్వి సొమ్ముచేసుకుంటున్న మైనింగ్ మాపియా కొండపై ఉన్న ప్రాచీన కాలం నాటి ఆలయాన్ని సైతం ధ్వంసం చేసింది. వందల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఇప్పటికే శిధిలావస్థకు చేరుకోగా, కేవలం ఆలయ ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ప్రస్తుతం అది కూడా నేలమట్టం చేశారు. దీంతో కదిరి ఆర్టీఓ కార్యాలయం ఎదుట దేవిరెంటి వంశీకుల ధర్నా చేపట్టారు. కాగా..మొత్తం 121 ఎకరాలలో విస్తరించి ఉన్న గుండ్రాజులకొండపై కేవలం 29 ఎకరాల భూమిని మాత్రమే మైనింగ్‌కు అనుమతించామని అధికారులు అంటున్నారు. కేటాయించిన సర్వే నంబర్‌లోనే ఆలయం ఉండటంతో.. దాన్ని తొలగించామని మైనింగ్‌కు పాల్పడుతున్న వాళ్లు చెప్పడం గమనార్హం.