సాక్షి, అమరావతి: వయస్సు పెరిగేకొద్ది చంద్రబాబు నాయుడు ప్రవర్తన దిగజారిపోతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు భాష, బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం బాగోలేదని లేదని..సీనియర్ నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువయిందని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా పోలీసులతో అడ్డుకునేలా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పోలీసులపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారన్నారు. మరి ఇదే డీజీపీ చంద్రబాబు ప్రభుత్వంలో కమిషనర్‌గా పనిచేయలేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా మబ్బుల్లోంచి బయటకు రా..
పోలీసులు, భద్రత లేకుండా చంద్రబాబు వెళ్లగలరా అని అన్నారు. పోలీసులను విమర్శించడం తగదని హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటికైనా మబ్బుల్లో నుంచి బయటకు రావాలని సూచించారు. గతంలో విశాఖను ఎందుకు అభివృద్ధి చేయలేదని..భూ కబ్జాలు,అక్రమాలు చేసినవారిని పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ గేట్లు తీస్తే చంద్రబాబు పక్కన కూర్చోన్న వాళ్లు కూడా ఎవ్వరూ ఉండరని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment