కక్కుర్తి మంత్రాంగం! | minister lobying for car numbers! | Sakshi
Sakshi News home page

కక్కుర్తి మంత్రాంగం!

Published Sun, Dec 15 2013 12:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కక్కుర్తి మంత్రాంగం! - Sakshi

కక్కుర్తి మంత్రాంగం!

సాక్షి, హైదరాబాద్: మన అమాత్యులకు అన్ని రకాల అలవెన్సులు, అధికారిక కార్యక్రమాలకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. తిరగడానికి వాహనం, ఉండటానికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. మంత్రులకు పీఏలు, పీఎస్‌లు, భద్రత, రాచవుర్యాదలు ఇక సరేసరి! ఇన్ని ఇస్తున్నా సరే కొందరు మంత్రులు సొంత వ్యవహారాలకు, చిన్న చిన్న విషయూలకూ కక్కుర్తి పడుతున్నారు.
 
 నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు! మంత్రుల కోసం అధికారికంగా కేటాయించిన, ప్రత్యేకంగా కొనుగోలు చేసిన వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు అయ్యే వ్యయానికి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ వుంత్రులు తావుు సొంతంగా కొన్న వాహనాల ఫ్యాన్సీ నంబర్లకూ ప్రత్యేక మినహాయింపులు కోరుకున్నారు. వారి బంధువులకూ మినహాయింపు అడుగుతున్నారు. నిజానికి వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే వేలం పాటలో కొనుక్కోవాలి. ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే నంబర్ దక్కాలనేది ప్రభుత్వ విధానం. ఇంత చిన్న విషయూనికీ మినహారుుంపులు పొందిన వుంత్రుల వ్యవహారం ఇదుగో మీరే చూడండి... గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు, దేవాదాయ శాఖ మంత్రి సీ రామచంద్రయ్య ఇటీవల సొంతంగా వాహనాలను కొనుగోలు చేశారు.
 
 వీరిద్దరూ ప్రత్యేక ఉత్తర్వులతో వేలం పాట నుంచి మినహాయింపు పొంది ఒకరేమో 1వ నంబర్, మరో మంత్రి 999వ నంబర్ తమ వాహనాలకు కేటాయింపజేసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తొలుత అధికారులు తిరస్కరించారు. అయితే, అమాత్యులు వింటే కదా.... ఫైళ్లను ఆర్థిక మంత్రి వద్దకు పంపి మరీ మినహాయింపులు పొందారు. సాధారణంగా ఈ నంబర్లకు చాలా మంది పోటీపడతారు. ఒకరికి ఒక ధర ఇంకొకరికి మరో ధర ఉండకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో వాహనాల నంబర్లకు వేలం పాట విధానాన్ని అధికారులు అమల్లోకి తెచ్చారు. 1, 999 నంబర్లను వేలం పాట వేస్తే ఐదారు లక్షల రూపాయల వరకు ధర పలుకుతాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 

ఈ ఇద్దరు వుంత్రులను చూసిన వురో వుంత్రి వట్టి వసంత్‌కువూర్  వురో అడుగు వుుందుకేసి తన సమీప బంధువుకూ ఈ మినహారుుంపు ఇవ్వాలంటూ కోరారు. ఫ్యాన్సీ నంబర్‌కు వేలం పాట నుంచి వట్టి మినహాయింపును కూడా కోరారు. దీన్ని అధికారులు వ్యతిరేకిస్తేనేం.. ఫైల్ సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నుంచి మినహాయింపు పొందడమే మిగిలి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పలుకుబడి ఉన్న ప్రతీ నాయకుడు ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట నుంచి మినహాయింపులు పొందుతారని, ఇక ఫ్యాన్సీ నంబర్లు రాజకీయు నేతలకే దఖలు పడతాయుని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement