ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆదివారం జిల్లాలోని 188 కేంద్రాల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ 120 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. 64 వీఆర్‌ఓ పోస్టులకు 59,473 మంది.. 167 వీఆర్‌ఏ పోస్టులకు 2962.. రెండింటికీ 1683 మంది దరఖాస్తు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్‌ఓ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓలు), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏలు) పరీక్షకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని కలెక్టర్ లోకేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 2న నిర్వహించే ఈ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ప్రాతిపదికనే నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఎలాంటి ఇంటర్వ్యూలూ ఉండవని, అభ్యర్థులు దళారులను నమ్మవద్దని సూచించారు.
శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఆర్వో హేమసాగర్, ఏపీపీఎస్సీ అధికారి నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 64 వీఆర్ ఓ పోస్టులకు 59,473 మంది, 167 వీఆర్‌ఏ పోస్టులకు 2,962 మంది, రెండింటి కీ కలిపి 1,683 మంది... మొత్తం 64,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీఆర్‌ఓ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌ఏ అభ్యర్థులకు మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పరీక్ష ఉంటుందన్నారు. వీఆర్‌ఓ అభ్యర్థులకు 188 పరీక్ష కేంద్రాలు (జిల్లా కేంద్రంలో 81, డివిజన్ కేంద్రాల్లో 39, తాలూకా కేంద్రాల్లో 68) ఏర్పాటు చే శామన్నారు. వీఆర్‌ఏ అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోనే తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 41 మంది లైజన్ ఆఫీసర్‌లు, 188 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 43 మంది అబ్జర్వర్‌లను నియమించినట్లు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉదయాన్నే ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశించామన్నారు. ప్రతి అభ్యర్థి సమాధానపత్రంపై సంతకంతో పాటు వేలిముద్రలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. కుడిచేత్తో రాసే వారితో ఎడమ చేతి బొటనవేలు ముద్ర, ఎడమ చేత్తో రాసే వారి నుంచి కుడిచేతి బొటనవేలు ముద్ర తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇతరులు పరీక్ష రాసేందుకు వీలు లేకుండా అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి హాజరవుతుండగానే వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. అభ్యర్థి కాకుండా ఇతరులు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళా అభ్యర్థినుల తనిఖీ కోసం మహిళా కానిస్టేబుళ్లను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లు మూత వేయాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీపీఎస్సీ అధికారి నాగార్జున మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోకి మీడియాకు అనుమతి లేదని, గేట్ బయటనే ఫొటోలు తీసుకోవాలని సూచించారు.సందేహాలుంటే... వీఆర్‌ఓ, వీఆర్‌ఏ రాత పరీక్ష నిర్వహణలో సందేహాలు తలెత్తితే ఏపీపీఎస్సీ అధికారి నాగార్జున (సెల్ : 8498098258), డీఆర్వో హేమసాగర్ (9493188804), క లెక్టరేట్ సూపరింటెండెంట్ వరదరాజులు (9493188811)ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
పటిష్ట బందోబస్తు
ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేటప్పుడు ప్రతి లైజన్ ఆఫీసర్ వెంట ఇద్దరు, 41 రూట్లకు 82 మంది సెక్యూరిటీ గార్డులుంటారు.
ఫ్లయింగ్ స్క్వాడ్స్ వద్ద ఒక్కొక్కరు చొప్పున సెక్యూరిటీ గార్డ్సును నియమించారు. 21 ఫ్లయింగ్ స్క్వాడ్‌ల వద్ద 21 మంది సెక్యూరిటీ గార్డులుంటారు.
పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు పర్యవేక్షణకు తగిన సిబ్బందిని సిద్ధం చేశారు.
సందేహాలుంటే 18004256401కు ఫోన్ చేయండి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షకు సంబంధించి సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. 18004256401 నంబర్‌ను కేటాయించారు. ఈ సెంటర్ పర్యవేక్షణకు జూని యర్ అసిస్టెంట్ సనత్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అభ్యర్థులకు హాల్ టిక్కెట్‌లకు సం బంధించిన ఏవైనా ఫిర్యాదులు,ఆయా కేం ద్రాల్లో ఇన్విజిలేటర్‌లు, చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. హెల్ప్‌లైన్ సెంటర్ రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Published Sat, Feb 1 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement