సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి లోక్‌సభలో నొక్కి చెప్పారు. ఆయన గురువారం లోక్‌సభలో హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, హోదాపై సభలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని కేంద్రం తీరును మిథున్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, గడిచిన అయిదేళ్లలో ఏపీకి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్‌లో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదని ఎంపీ విమర్శించారు.
ఎంపీ మాట్లాడుతూ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఏపీకి రూ.60వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఉంది. రాజధాని లేదు. మౌలిక వసతులు లేక రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది. రాయితీలు పెద్దగా లేకపోవడంతో పరిశ్రమలు రావడం లేదు. వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్ల నుంచి నిధులు విడుదల కావడం లేదు. స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం, పారిశ్రామిక కారిడార్ హామీలు ఏమైపోయాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలి. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఏపీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు చేస్తున్న వారిపై జీఎస్టీ పెనాల్టీ విధిస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ చెల‍్లించడం లేదు. దీనిపై సరైన యంత్రాంగం తయారు చేయాలి.’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment