'రైతుబజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే గద్దె' | mla gadde rammohan selling stalls in raithu bazar, alleges ex mla ravi | Sakshi
Sakshi News home page

'రైతుబజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే గద్దె'

Published Sat, Dec 27 2014 3:01 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

'రైతుబజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే గద్దె' - Sakshi

'రైతుబజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే గద్దె'

కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నిన్నటికి నిన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో మండిపడితే.. ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పటమట రైతుబజార్లో స్టాళ్లను గద్దె రామ్మోహన్ టోకున విక్రయిస్తున్నారని, ఒక్కో స్టాల్కు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని యలమంచిలి రవి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కొంతమంది నేతలు తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. గద్దె రామ్మోహన్ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వద్దే పంచాయితీ పెడతానని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement