
సాక్షి, విశాఖపట్నం: అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా అమెరికా, ఇటలీ లాంటి ఎన్నో అగ్ర దేశాలు వణికిపోతున్నాయని పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే అమెరికాలో కరోనా ప్రభావం భారీగా కనిపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనుందని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. మనమంతా బాధ్యతగా..సంఘీభావంగా మెలగాల్సిన సమయమిదని తెలిపారు. కరోనా కట్డడి చేయాలంటే ప్రజలంతా బాధ్యతగా ఉండాల్సిందేనన్నారు. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదని.. మానవాళి ఎదుర్కొంటున్న జాతీయ విపత్తు అని ఆయన పేర్కొన్నారు.
(‘చంద్రబాబూ.. కరోనాపై రాజకీయాలు మానుకో’)
Comments
Please login to add a commentAdd a comment