ఆళ్ల రామకృష్ణా రెడ్డి
గుంటూరు: ప్రభుత్వం భూసేకరణకు దిగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) హెచ్చరించారు. ఏపీ రాజధాని కోసం భూసేకరణకు సంబంధించి కోర్టు మొట్టికాయలు వేస్తున్నా, మంత్రి నారాయణ తప్పుడు ప్రకటనలుమానడంలేదని అన్నారు. అసలు సీఆర్డీఏ నిబంధనలు ఏమిటో మంత్రి తెలుసుకోవాలని హితవు పలికారు. రైతులనే కాదు, కోర్టులను సైతం తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.
9.2 పత్రాల గురించి కోర్టు ఏం చెప్పిందో మంత్రి ఓ సారి ఉత్తర్వులు చూసుకుంటే మంచిదని అన్నారు. రైతులకు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోం అని ఆర్కే హెచ్చరించారు.