విజయనగరం మున్సిపాలిటీ : రైతు సమస్యలపై వైఎస్‌ఆర్‌సీపీ సమరశంఖం పూరించింది. మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన టీడీపీ సర్కారు, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. దగాకోరు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడాయంటూ హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పక్షాన చేస్తున్న ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదని హెచ్చరిస్తూ ప్రభుత్వ తీరుకు నిరసనగా సుమారు గంటన్నర పాటు కలెక్టరేట్ జంక్షన్ వద్ద ధర్నా చేసి, రహదారిని దిగ్భందించారు.
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగేది కాదని, వారికి న్యాయం జరిగేంత వరకు, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హమీలు నెరవేర్చేంత వరకు సాగిస్తామని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యు డు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హమీలను నమ్మిమోసపోయిన ప్రజలు ఇ ప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రైతు సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసినట్టు చెప్పారు. వ ర్షాలు కురుస్తున్నా వ్యవసాయ రుణాల మంజూరుపై ప్రభుత్వం బ్యాంకర్లతో స మావేశం నిర్వహించకపోవటం దారుణమన్నారు.
సబ్సిడీపై పంపిణీ చేయాల్సి న విత్తనాలు, ఎరువులు విషయంపై కనీ సం స్పందించకపోవటం ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలి యజేస్తోందని చెప్పారు. రుణమాఫీ జరగక, ఉన్న బకాయి లు తీరక, కొత్త రుణాలు వచ్చే మార్గంలేక రైతులు అవస్థలుపడుతున్నారని చెప్పా రు. వెంటనే రుణమాఫీ చేయలని డి మాండ్ చేశారు. కొత్తరుణాలపై ప్రకటన చేయాలని, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
బాబు... నిజాయితీ నిరూపించుకో...
నీతివంతమైన పాలన అందిస్తాం.. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పుకునే చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఓ టుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు జై లుకు వెళ్లక ముందే పదవికి రాజీ నామా చేసి సీబీఐ విచారణ జరిపించుకోవటం ద్వారా తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఢిల్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రాగాలరా అంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
విజయనగరం పార్లమెంటరీ నియెజకవర్గ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనుమత్స సాంబశివరాజు, జి ల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల.శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, నెల్లిమర్ల నియెజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గెదల.సన్యాసినాయుడు,డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విజ యనగరం పట్టణ, మండల అధ్యక్షులు ఆశఫు.వేణు, నడిపేన.శ్రీనివాసరావు, కౌ న్సిలర్ ఎస్.వి.వి. రాజేష్, పూసపాటిరేగ మండలం అధ్యక్షుడు పతివాడ.అప్పలనాయుడు, రొంగలి జగన్నాథం,సుంకర.రమణమూర్తి, గర్భాపు ఉదయభాను, మారం బాలబ్మహ్మారెడ్డి, పువ్వల నాగేశ్వరరావు,మజ్జి వెంకటేష్, వర్రి నర్సింహమూర్తి, మంత్రి అప్పలనాయుడు, రౌతు జయప్రసాద్, కడుబండి రమేష్, గుడివాడ రాజేశ్వరరా వు, గొర్లె రవికుమార్, వలిరెడ్డి.శ్రీనివాసరావు, ఇప్పిలి అనంత్, ఉప్పాడ.సూర్యనారాయణ, బంటుపల్లి వాసుదేవరావు, జరజాపు.సూర్యనారాయణ, జరజాపు.ఈశ్వరరావు, జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భూముల్లాక్కొంటున్నారు...
సాలూరు ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 600పైగా హమీలు ఇచ్చిన పచ్చచొక్కా నేతలు వాటన్నింటినీ విస్మరించారని విరుచుకుపడ్డారు. సీఎం, మంత్రులు ఎంత సేపు సింగపూర్, చైనా, జపాన్ పర్యటనలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే రైతులకు చెందిన భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతులను రుణగ్రస్తులుగా మార్చుతున్నారని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఒక్క గిరిజన రైతుకైనా రుణమాఫీ చేశారా ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగభృతి కల్పిస్తామని, ఇళ్లులేని వారికి కొత్త ఇళ్లు ఇస్తామని, రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభు త్వ తీరును ప్రజలను గమనిస్తున్నారని, టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయంటూ హెచ్చరించారు.
అంతం కాదిది...
Published Fri, Jun 26 2015 1:37 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement