విశాఖపట్నం : ఇటీవల ఆఫ్రికా ఖండం టాంజానియాలో కిలిమంజారో పర్వతంపై 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఉహురు శిఖరాన్ని అధిరోహించిన సబ్బవరం యువకుడు రాజాన నానాజీ పెందుర్తిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తాను సాధించిన ఘనతను వివరించాడు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఉహురు శిఖరం ఆధిరోహణకు తనతో పాటు ఏడు దేశాలకు చెందినవారు పాల్గొన్నారన్నారు. రాష్ట్రం నుంచి 40 మంది పాల్గొనగా అందులో జిల్లాకు చెందిన ముగ్గురు ఉండగా సబ్బవరం నుంచి తాను పాల్గొన్నట్టు తెలిపారు. తరువాత రష్యాలోని ఎల్‌బ్రోస్, నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. సాహసం తనకు ఇష్టమన్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్‌లు కనకరాజు, వనం అచ్చింనాయుడు, గొర్లె నూకరాజు, సరిపల్లి బంగార్రాజు, మామిడి కొండాజీ తదితరులు ఉన్నారు.
మీరు వస్తేనే ఉద్యోగాలు
అనంతపురం జిల్లా నుడ్గుకుప మండలం కోరలపలిŠల్ గ్రామం నుంచి వచ్చా. వైఎస్ జగన్‌ను విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపిల్లి వద్ద కలిసి సమస్యలు చెప్పుకున్నా. నా కుటుంబంలోని ముగ్గురు పిల్లలతో పాటు అనేక మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వయసుమీరుతున్నా ఉద్యోగాలు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. –డి. హనుమంత్ నాయక్, అనంతపూర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment