![చంద్రబాబుపై ఎంపీ శివప్రసాద్ అసంతృప్తి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51492254981_625x300.jpg.webp?itok=IYAOunmT)
చంద్రబాబుపై ఎంపీ శివప్రసాద్ అసంతృప్తి
తిరుపతి: టీడీపీ ఎంపీ శివప్రసాద్.. ముఖ‍్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను భూకబ్జాదారుడిగా పేర్కొనడం దారుణమని, వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో అవాస్తవాలు మాట్లాడారని శివప్రసాద్ అన్నారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై తాను మాట్లాడానని చెప్పారు. టీడీపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోవడం దారుణమని అన్నారు. దళితులకు న్యాయం జరగాలని కోరడం తప్పా? అని శివప్రసాద్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దళితులు ఇంకెంత కాలం మోసపోవాలని ప్రశ్నించారు.