పాఠశాల బస్సు కింద దూరి ఎంపీటీసీ సభ్యుడి కుమారుడు మృతి
కన్నీరుమున్నీరు అయిన తల్లిదండ్రులు..కుటుంబ సభ్యులు
మందస మండలం లక్ష్మీపురంలో విషాదం
మందస: మందస మండలం బేతాళపురం పంచాయతీ లక్ష్మీపురంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బేతాళపురంఎంపీటీసీ సభ్యుడు కారి ఈశ్వరరావు రెండో కుమారుడు బస్సు కింద దూరి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు..గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కారి ఈశ్వరరావు, అనూషలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీక్షిత్ కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నాడు. రెండో కుమారుడు రేవంత్. వయసు రెండున్నరేళ్లు. రోజులాగే తల్లి అనూష గురువారం ఉదయం పెద్ద కుమారుడు దీక్షిత్‌ని ఇంటి వద్ద పాఠశాల బస్సు ఎక్కించింది. అక్కడే ఉన్న చిన్న కుమారుడు రేవంత్ నడుచుకుంటూ బస్సు కిందకు వెళ్లిపోయాడు.
ఇది గమనించని బస్సు డ్రైవర్ బస్సు ను లాగించాడు. ఇంతలో బస్సు కిం ద నుంచి పెద్దాగా ఏడుపు వినిపించింది. అంతా గట్టిగా అరవడంతో బస్సును తక్షణమే ఆపేశాడు. అనూష ఇంటి వద్ద రేవంత్‌ను చూడగా లేకపోవడంతో బస్సు కిందకు చూసింది. రేవంత్ బస్సుకింద తలకు గాయం అయి ఉండడం గమనించి కేక పెట్టింది. బాలుడిని బయటకు తీసి చూడగా చెవి, ముక్కు నుంచి రక్తం స్రవించడంతో వెంటనే కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు రేవంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. చిన్నారి మృతితో అతని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బంధువులు.. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన డీఎస్పీ దేవ ప్రసాద్, ఎస్‌ఐ వి.రవివర్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే: ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరరావు కుమారుడు మృతి వార్త తెలిసిన పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ హుటాహుటిన లక్ష్మీపురం చేరుకున్నారు. చనిపోయిన చిన్నారి వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు కన్నీరు పెట్టుకున్నారు. ఈశ్వరరావు ఇంటికి వచ్చినపుటు తన వద్దకు వచ్చి చేతులు పట్టుకుని ఆడుకునేవాడని గుర్తు చేసుకున్నారు.
అయ్యో కొడుకా...
Published Fri, Aug 7 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement