లారీఢీకొని సైక్లిస్టు దుర్మరణం
Published Tue, Aug 9 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
జీలుగుమిల్లి : మండలంలోని లక్ష్మీపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సేతుకూరి రామారావు(55) వ్యవసాయ పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఇరపం భాస్కరరావు తెలిపారు. మృతుడు రామారావు భార్య గతంలోనే మృతి చెందగా.. వ్యవాయ కూలీ పనులు చేసుకుంటూ కుమారుడి వద్ద ఉంటున్నాడు.
Advertisement
Advertisement