మున్సిపల్ ఇంజినీర్లపై బొత్స అసహనం
Published Fri, Nov 22 2013 3:22 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్ :పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పను లు చెప్పేందుకు ఇంజినీర్లు ఎవరూ లేవడం లేదు. అసలు ఇంజినీర్లు ఉన్నారా? లేదా? వారికి పనుల గురించి తెలియదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ డీఈ నెల రోజుల్లో 20 రోజులు సెలవులోనే ఉంటున్నారని ఆయనకేమి తెలుస్తుందని మాజీ కౌన్సిలర్ పిళ్లా విజయ్‌కుమార్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన ఏఈ లేచారు. సమాధానం చెప్పారు. ఇంత నెమ్మదిగా ఉంటే ఎలాగని మంత్రి ప్రశ్నించారు. మున్సిపాలిటీలో మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు, మాజీ కౌన్సిలర్లతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం సమీక్షించారు.
ముందుగా రచ్చబండపై సమీక్షించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు తదితర వాటిపై వివరాలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో రెండు బృందాలు శుక్రవారం పర్యటించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కూడా కౌంటర్ ఏర్పాటు చేయూలని ఆదేశించారు. తరువాత 30 రోజుల్లో 30 పథకాల శంకుస్థాపన కార్యక్రమాలపై సమీక్షించారు. 30 రోడ్ల పరిస్థితి ఎంత వరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. పనులను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఏఈలు ఉండాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారని ఉద్యోగి చెప్పడంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అశోక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోపణలు మంచిది కాదని, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణంలోని పైపులైను పురాతన కాలం నాటిది కావడంతో లీకులు అవుతున్నాయని అధికారులు తెలిపారు.
పట్టణంలో 307 లీకేజీలు ఉన్నాయని మంత్రి దృష్టికి తేగా 13వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్, లైట్లు వంటి వాటిని వినియోగించాలని సూచించారు. పట్టణంలో నూతనంగా పైపులైనులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.39 కోట్లు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. బంగారుతల్లి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలతో సమావేశమై యూక్షన్ ప్లాన్ తయూరు చేయూలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మున్సిపల్ ప్రత్యేకాధికారి జేసీ పీఏ శోభ, రచ్చబండ కమిటీ సభ్యుడు పిళ్లా విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, తహశీల్దార్ పెంటయ్య, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement