రెండు రాష్ట్రాల గవర్నర్గా నరసింహన్ నియామకం!
న్యూఢల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ను ...ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నరసింహన్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన ఆర్థికమంత్రి చిదంబరంతో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం అయిదు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నరు.ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు జీవోఎంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
అంతే కాకుండా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై జీవోఎంతో నరసింహన్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచే అంశంపై నరసింహన్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర ప్రాంత నేతలు, యూటీకి ఒప్పుకునేది లేదని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ల నేపథ్యంలో గవర్నర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.