సాక్షి, కృష్ణా: వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూర్చేలా ముందుకు వెళ్ళుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ కార్యాలయం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల ద్వారా జనవరి నాటికి రూ.36 వేల కోట్లు వసూలు చేశామని తెలిపారు. మార్చి 31 నాటికి రూ.45 వేల కోట్లు వసూలు అవుతాయని అంచనా వేశారు. వసూళ్లు అధికంగా చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజెస్తామని నారాయణ స్వామి తెలిపారు. గ్రానేట్ అక్రమాలపై దృష్టి పెట్టి అవసరమైతే అలాంటి వారిపై కేసులు పెడతామని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర జీఎస్టీ నుంచి రాష్టానికి రూ.600 కోట్ల బకాయిలు రావల్సి ఉందని మంత్రి నారాయణ స్వామి అన్నారు. కేబుల్ ఆపరేటర్లకు జీఎస్టీ విధింపుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో ప్రతి ఒక్కరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. నవరత్నాలు అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. డివిజన్ వారిగా అధికారులకు ఇప్పటికే టార్గెట్లు ఇచ్చామని నారాయణ స్వామి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ పీయూష్ కుమార్, స్పెషల్ సీఎస్ డి సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment