commercial taxes
-
ఆదాయం ఎందుకు తగ్గింది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఆదాయం తగ్గడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రావాల్సిన ఆదాయం కంటే గడిచిన ఆరేడు నెలల్లో ప్రతినెలా ఆదాయం రూ 650 కోట్ల మేరకు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గడానికి కారణాలేంటి? ఎక్కడ లొసుగులున్నాయో దృష్టిపెట్టాలని ఆదేశించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, రవాణా, మైనింగ్, ఎక్సైజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో గురువారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సది్వనియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల లక్ష్యం రూ.85,126 కోట్లుగా ఉంటే.. ఏప్రిల్‌నుంచి సెపె్టంబర్‌వరకు రూ.42,034 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.37,315 కోట్లు మాత్రమే వచి్చంది. రూ.4,719 కోట్లు తక్కువ రావడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. లక్ష్యాన్ని చేరుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆదాయ వసూళ్లపై నిక్కచి్చగా ఉండాలని, అవసరమైతే సంబంధిత విభాగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలని, సంస్కరణలు చేసుకోవాలని సూచించారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రతీశాఖ పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని హెచ్చరించారు.అత్యధికంగా జీఎస్టీలో 4,086 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూ.654 కోట్లు తక్కువగా వచి్చనట్లు తేలింది. రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని. అటువంటి వారిని కూడా గుర్తించాలని ఆదేశించారు. మద్యం విక్రయాల్లో ఆదాయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలన్నారు. ఆర్ఆర్ఆర్తో సానుకూల వాతావరణం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వీటితోపాటు ఫోర్త్‌సిటీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త ఎయిర్‌పోర్టులు వంటివాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లలేదని, గందరగోళానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పినట్లు తెలిసింది.ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూలి్చవేసిందని, అన్నీ సక్రమంగా ఉన్న భూముల విలువ పెరిగి.. రిజి్రస్టేషన్లు పెరగాల్సిన చోట.. ఆదాయం తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీలోని నిర్మాణాల తొలగింపునకు, రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఎలా ముడిపెడతారని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. -
పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!
విజయవాడ గాంధీనగర్‌లో మదీనా ఎంటర్ ప్రైజెస్ అనే బోగస్ సంస్థను సృష్టించి పాత ఇనుము విక్రయాల ద్వారా రూ.7.2 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు లెక్క చూపారు. ఈ లావాదేవీలన్నీ పేపరు మీద ఉన్నాయి తప్ప.. వాస్తవంగా సరుకు కొన్న, అమ్మిన దాఖలాల్లేవు. ఈ విషయాన్ని అధికారులు టోల్గేట్ ద్వారా వెళ్తున్న వాహనాల ఫాస్ట్యాగ్, వేబిల్లుల సిస్టం ద్వారా కనుగొన్నారు. విజయవాడ–3 సర్కిల్ పరిధిలోని పెనమలూరులో కె.వి.రావు ట్రేడర్స్ పేరుతో ఫేక్సంస్థను సృష్టించి రూ.2.27 కోట్లకు పైగా టర్నోవర్ చేసినట్లు కనుగొన్నారు. ఇవన్నీ పేపరుపైన లావాదేవీలే తప్ప.. వాస్తవంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగలేదని అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇలా బోగస్ సంస్థలు సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ (కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించేపన్ను) కట్టకుండా ఎగవేసే దొంగల్ని వాణిజ్యపన్నుల అధికారులు వేటాడుతున్నారు. తుక్కు ఇనుముకు సంబంధించి కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపుతూ, మాన్యుఫాక్చర్ యూనిట్లకు లబ్ధి చేకూరుస్తున్న వారిని గుర్తించి పెనాల్టిలు వేసేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల విజయవాడలో పాత ఇనుము వ్యాపారానికి సంబంధించి నమోదై ఉన్న సంస్థల్లో వాణిజ్యపన్నుల అధికారులు చేసిన తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో 18 బోగస్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. వీటిద్వారా రూ.40 కోట్లకుపైగా టర్నోవర్ జరిగినట్లు గుర్తించారు. ఆ సంస్థలకు సంబంధించి అసలైన యజమానులను గుర్తించి పెనాల్టీ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారిలా.. పాత ఇనుము వ్యాపారం చేసే వారిలో కొందరు వివిధ మార్గాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ వద్ద పనిచేసే పేదల ఆధార్‌కార్డు తీసుకుని పాన్‌కార్డు దరఖాస్తు చేసి, దొంగ రెంటల్ అగ్రిమెంట్‌తో ఆన్లైన్లో కాటన్, టెక్స్టైల్స్, కిరాణా వ్యాపారం పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత పాత ఇనుము కమోడిటీని దానికి యాడ్ చేస్తున్నారు. విచ్చలవిడిగా ఇన్వాయిస్లు, వేబిల్లులు సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని దొంగచాటుగా కాగితాలపైనే సరఫరా చేసినట్లు చూపి, మాన్యుఫాక్చ రింగ్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నారు. మున్సిపల్ పన్ను రశీదులను సైతం ఈ బోగస్ సంస్థల సృష్టికి కొంతమంది వాడుకుంటున్నారు. మున్సిపల్ వెబ్సైట్ నుంచి ఏదో పేరు మీద ఉన్న పన్ను రశీదులను డౌన్లోడ్ చేసుకొని, దొంగ లీజు అగ్రిమెంట్లతో నకిలీ సంస్థలను సృష్టిస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు లబ్ధి ఇలా.. పాత ఇనుము సేకరించే హాకర్స్‌కు ఎటువంటి ఇన్పుట్ ట్యాక్స్ ఉండదు. పాత ఇనుము వివిధ మార్గాల్లో కొన్నదానికి బిల్లులు ఉండవు. ఇలా కొనుగోలు బిల్లుల్లేకుండా సరుకును రీరోలింగ్ మిల్లుకు సరఫరా చేస్తే ఆ కంపెనీ వారు ప్రభుత్వానికి 18 శాతం ట్యాక్స్ చెల్లించాలి. కానీ ట్యాక్స్ కట్టకుండా ఎగవేసేందుకు ఈ నకిలీ సంస్థలను సృష్టించి ఫేక్ అమ్మకం బిల్లులను జనరేట్ చేసి, ఈ–వేబిల్లులు, బ్యాంకు అకౌంట్ల ద్వారా లబ్దిపొంది, వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రీరోలింగ్ సంస్థలకు పాస్ చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే వస్తువులకు దొంగ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వాడుకుని ఈ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లబ్దిపొందుతున్నాయి. బోగస్ సంస్థలను సృష్టించి పాత ఇనుమును ఎక్కువగా విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. దోషులను పట్టుకునేందుకు చర్యలు బోగస్ సంస్థలు సృష్టించి, పన్ను ఎగవేసే వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులతోపాటు, దాని వెనుక ఉన్న అసలైన దోషులను, సాఫ్ట్వేర్, ప్రత్యేక నిఘా ఆధారంగా గుర్తించి, వారు టర్నోవర్ చేసిన మొత్తానికి సంబంధించి పెనాల్టీ వసూలు చేస్తాం. ఇటీవల విజయవాడలో చేసిన తనిఖీల్లో 43 కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు విచారణలో 18 బోగస్ సంస్థలను గుర్తించాం. – ఇ.కృష్ణమోహన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్, వాణిజ్యపన్నుల శాఖ విజయవాడ రీజియన్ -
సీఎం జగన్‌కు ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్ 2 సర్వీసెస్‌లో జీఎస్టీ ఆఫీసర్లకు గెజిటెడ్ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్ సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జీఎం రమేష్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.విద్యాసాగర్, ట్రెజరర్ జీఆర్‌వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ -
‘గ్రానైట్ అక్రమాలపై దృష్టి పెట్టాలి’
సాక్షి, కృష్ణా: వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూర్చేలా ముందుకు వెళ్ళుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ కార్యాలయం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల ద్వారా జనవరి నాటికి రూ.36 వేల కోట్లు వసూలు చేశామని తెలిపారు. మార్చి 31 నాటికి రూ.45 వేల కోట్లు వసూలు అవుతాయని అంచనా వేశారు. వసూళ్లు అధికంగా చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజెస్తామని నారాయణ స్వామి తెలిపారు. గ్రానేట్ అక్రమాలపై దృష్టి పెట్టి అవసరమైతే అలాంటి వారిపై కేసులు పెడతామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర జీఎస్టీ నుంచి రాష్టానికి రూ.600 కోట్ల బకాయిలు రావల్సి ఉందని మంత్రి నారాయణ స్వామి అన్నారు. కేబుల్ ఆపరేటర్లకు జీఎస్టీ విధింపుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో ప్రతి ఒక్కరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. నవరత్నాలు అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. అవినీతి రహిత పరిపాలన అందించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. డివిజన్ వారిగా అధికారులకు ఇప్పటికే టార్గెట్లు ఇచ్చామని నారాయణ స్వామి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ పీయూష్ కుమార్, స్పెషల్ సీఎస్ డి సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
వీధికెక్కిన వసూళ్ల పర్వం
జంగారెడ్డిగూడెం : జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో వసూళ్ల పర్వం వీధికెక్కింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వసూళ్ల వ్యవహారంపై విచారణ నిర్వహిస్తున్న తన విధులకు ఆటంకపర్చడంతోపాటు వసూళ్ల కేసును నీరుగార్చాలని ఒత్తిడి తెస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆ శాఖ సర్కిల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో వేళ్లూనుకున్న వసూళ్ల వ్యవహారాలు, ఫిర్యాదులొస్తే నీరుగార్చేందుకు అధికారుల్లో కొందరు ఎంతకైనా తెగిస్తారనే విషయాల్ని మరోసారి వెలుగులోకి తెచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు వద్ద నిత్యం పెద్దఎత్తున అనధికారిక వసూళ్లు సాగుతున్నాయి. ఇక్కడి దందా వెలుగులోకి రావడంతో.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జంగారెడ్డిగూడెం సర్కిల్ వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) వి.కేదారేశ్వరరావుకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన విచారణ చేపట్టగా.. వ్యవహారాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సీటీవో కేదారేశ్వరరావు సోమవారం రాత్రి పోలీ సులను ఆశ్రయించారు. డీసీటీవో ఎ¯ŒS.దుర్గారావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, అటెండర్ రంగారావు, ఆనందశేఖర్ అనే వ్యక్తి కేసును నీరు గార్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు సీటీవో ఫిర్యాదు చేశారు. డీసీటీవో దుర్గారావు, శ్రీనివాస్, రవికుమార్, రంగారావు తన విధులను ఆటంకపర్చడంతోపాటు రౌడీయిజం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అక్రమ వసూళ్లపై తాను విచారణ నిర్వహిస్తుండగా.. ఈ కేసులో రాజీ పడాలని వేధిస్తున్నారని, లేదంటే తన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో హైకోర్టులో అప్పీల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడంతోపాటు మానసికంగా వేధిస్తున్న ఆ ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీటీవో కేదారేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎ¯ŒS.కేశవరావు సోమవారం రాత్రి చెప్పారు. -
ట్రెజరీ..ఉక్కిరిబిక్కిరి!
► నేటితో ఆర్థిక సంవత్సరం ముగింపు ► ఖజానాకు ఒక్కసారిగా బిల్లులు రాక ► పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో కమీషన్ల దందా.. ► ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా శాఖల్లో లక్ష్యాలపై సమీక్షలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హడావుడి నెలకొంది. ముఖ్యంగా పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాల్లో కమీషన్ల దందా కొనసాగుతుంటే, మరికొన్ని కార్యాలయాల్లో ఇచ్చిన లక్ష్యాలు ఎంత మేరకు చేరుకున్నామనే దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన నిధులు ఈ నెలాఖరులోపు ఖర్చుచేయకపోతే అవి మురిగిపోయే అవకాశం ఉండడంతో ఇంజినీర్లు పూర్తయిన పనులకు బిల్లులు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమకు రావాల్సిన బకాయిల వసూలుకు ట్రెజరీ వద్దనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అన్ని శాఖల బిల్లులు ఒకేసారి ట్రెజరీకి చేరడంతో అక్కడి సిబ్బంది పనితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ, రవాణాశాఖ తమకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యంలో ఏ మేరకు చేరుకున్నామనే దానిపై సమీక్ష జరిపి, మిగిలిన రోజులో పన్నుల వసూలుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రజల నుంచి రావాల్సిన పన్నుల వసూలుకు సిబ్బందిపై ఒత్తిడి పెంచడంతోపాటు పన్నుల చెల్లింపులపై విసృ్తతంగా ప్రచారం చేస్తున్నాయి. ట్రెజరీలో ఆమోదించిన బిల్లులు 4 వేలకుపైనే ... వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన 4 వేల బిల్లులను గుంటూరు ట్రెజరీ కార్యాలయం ఆమోదించింది. వీటికి దాదాపు రూ.40 కోట్లకుపైగానే నగదు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులకు ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయకపోవడంతో వాటి కోసం వివిధ ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు నిరీక్షిస్తున్నారు. కమీషన్ల దందా ... వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులకుగాను ఇంజినీర్లు చేసిన బిల్లులకు సంబంధించిన (ఎంబీ)ఎం.బుక్‌లను పే అండ్ అకౌంట్స్ కార్యాలయం పరిశీలించి చెక్కులను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో బిల్లుల నమోదు సక్రమంగా జరగకపోతే వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయడం, లేదంటే పూర్తిగా బిల్లులు నిలిపివేసే అధికారం ఈ కార్యాలయానికి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటే నగదు చెల్లింపులకు సిఫారసు చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ బిల్లుపై ఈ కార్యాలయ సిబ్బంది నిర్ణీత పర్సంటేజిని నిర్మాణసంస్థల నుంచి వసూలు చేయడం బహిరంగ రహస్యమే. మార్చి 31లోపు చెల్లింపులు జరగకపోతే కొత్త బడ్జెట్ అమల్లోకి రావడానికి నెల రోజుల జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణసంస్థల ప్రతినిధులు ఆ కార్యాలయం డిమాండ్ చేసిన పర్సంటేజిలను చెల్లిస్తున్నాయి. ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటివరకు వివిధ శాఖల నుంచి వచ్చిన బిల్లులకు రూ.50 కోట్లకుపైగా చెల్లింపులు జరిగితే మరో రూ.25 కోట్లకుపైగానే బిల్లులను పరిశీలించాల్సి ఉందని ఆశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. సందట్లో సడేమియాగా అడ్వాన్సు బిల్లులు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మార్చి 31లోపు ఖర్చు చేయకపోతే ఆ శాఖ అధికారి అసమర్థతగా ఉన్నతాధికారులు భావించే అవకాశం ఉండడంతో కొందరు ఇంజినీర్లు అడ్వాన్సు బిల్లులు కూడా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. 90 శాతం పూర్తయిన పనులకు మొత్తం చెల్లింపులకు సిఫారసు చేస్తూ నగదు చెల్లించి, ఆ తరువాత మిగిలిన 10 శాతం పనులు చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానంలో అడ్వాన్సు బిల్లులు చెల్లించినందుకు కమీషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. -
వాణిజ్యపన్నుల కేంద్రంపై ఏసీబీ దాడి
యాదమరి: చిత్తూరు జిల్లా యాదమరి మండలం జోడుచింతలలోని వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం వేకువజామున 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏసీపీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు ఈ తనిఖీల్లో పాల్గొగన్నారు. వాణిజ్యపన్నుల తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వసూళ్లకు మించి 25 వేల రూపాయలు ఉండటాన్ని గమనించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చెక్‌పోస్టులో ‘ప్రైవేట్’ దందా
♦ అధికారులు తప్పించుకునేందుకే.. ♦ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో తడ మండలం భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల దందా పెరిగిపోయింది. ప్రైవేట్ వ్యక్తులు డెరైక్ట్‌గా రోడ్డుమీదకొచ్చి వాహనాల నుంచి దందాలు వసూలు చేస్తున్నారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు జరిగిన గొడవలు కూడా పోలీసులు దాకా రాకుండా అక్కడికక్కడే సర్దుకుంటున్నారు. ఏసీబీ దాడులు జరిగినపుడు అధికారులు తప్పించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులను అధికారులే ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సూళ్లూరుపేట : భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో అత్యధిక ఆదాయం కలిగిన శాఖలుగా వాణిజ్య పన్నులు, రవాణా, గనులు, అటవీ, పశుసంవర్థక, భూగర్భ శాఖలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయా శాఖలకు పన్నులు చెల్లించకుండా రవాణా చేసే వాహనాలను పసిగట్టి ఎక్సైజ్ శాఖ పోలీసులు వసూళ్లు చేస్తున్నారు. వాహనాల రికార్డులు పరిశీలన, స్టాంపులు వేసి పంపడం వంటి పనులన్నీ ప్రైవేట్ వ్యక్తులే చూస్తున్నారు. ఒక దశలో ప్రైవేట్ వ్యక్తులు చెక్‌పోస్టులోకి ప్రవేశించి అధికారులను బయటకు పంపేసి వారి సీట్లలో కూర్చొని విధులు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో గతంలో ప్రైవేట్ వ్యక్తులందరినీ అరెస్ట్ చేయించి మాన్యువల్ తనిఖీలకు స్వస్తి చెప్పి కంప్యూటరైజ్డ్ తనిఖీలు ఏర్పాటు చేయడంతో పాటు చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును పసిగట్టేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో కొంతకాలం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే రెండు మూడేళ్లుగా చూస్తే చెక్‌పోస్టులో మళ్లీ ఆనాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి అధికారి ఒకరిద్దరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమంగా వచ్చిన సొమ్మును వారి ద్వారా సమీపంలోని దుకాణాల్లో దాచిపెడుతున్నారు. విధులు ముగించుకుని వెళ్లేపుడు లెక్కలు చూసుకుని తీసుకెళుతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. ఇదంతా ఒక ఎత్తయితే చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న కొందరు కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని వాహనాలు దాటిస్తూ చెక్‌పోస్టుకు దీటుగా మరో చెక్‌పోస్టు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాన్సిట్ పాసుల విషయంలో కూడా.. ట్రాన్సిట్ పాసులు విషయం కూడా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం నడుస్తోంది. కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలకు, స్థానికంగా బియ్యం వ్యాపారం చేస్తున్న వారికి వాహనం లేకుండా ట్రాన్సిట్ పాసులు సరఫరా చేస్తున్నారు. పన్నుల ఎగవేతకు పాల్పడేందుకు కొన్ని ట్రాన్స్‌పోర్టు సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పాసులు పొంది ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్లు నటించి మన రాష్ట్రంలోనే ఏదో ఒక పట్టణంలో సరుకులు అన్లోడ్ చేస్తారు. అధికారులను మేనేజ్ చేసి వాహనం లేకుండా పాసులు పొంది కొందరు ఈ తంతు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. -
మాచర్ల చెక్ పోస్టులో తనిఖీలు
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతర్రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం ఉదయం జరిపిన సోదాల్లో 10 ధాన్యం లారీలను నిలిపివేశారు. ఈ లారీలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నాయి. తనిఖీల్లో భాగంగా పన్నులు చెల్లించలేదని గుర్తించిన సిబ్బంది వాటిని నిలిపివేశారు. -
చెట్టు కిందే చెక్‌పోస్టు!
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టుల దుస్థితి ► చెట్ల నీడ, దాబాలే అధికారులు, సిబ్బందికి ఆవాసం ► తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో వాణిజ్య పన్నుల శాఖకు 7 చెక్‌పోస్టులు ► వీటిల్లో 294 మంది ఉద్యోగులు అవసరం.. 70 మందికి మించని స్థితి ► చెక్‌పోస్టులకు సర్కారు జాగా లేదు.. లీజుల ఫైలుకు మోక్షం లేదు ► ఒక్కో చెక్‌పోస్టుకు రూ. 3 కోట్లు కేటాయించినా ఖర్చు చేయని వైనం ► యథేచ్ఛగా సాగుతున్న అక్రమ సరుకుల రవాణా హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలు సాగించే సరుకు రవాణా వాహనాలను తనిఖీ చేసేందుకు ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రం ఏర్పాటై దాదాపు ఏడాది దగ్గరపడుతున్నా.. జాతీయ రహదారితో పాటు రాష్ట్రస్థాయి రహదారి చెక్‌పోస్టుల్లో కూడా ఎక్కడా ఒక్క భవనాన్ని నిర్మించలేదు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న రోడ్ల పక్కన అవసరమైన ప్రభుత్వ భూమి లేనందున కనీసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ అయినా చేయలేదు. దీంతో సంబంధిత అధికారులు రోడ్లపక్కన ఒక కారు పెట్టుకొని చెట్టు నీడలో కుర్చీలు వేసుకొని కూర్చోవడమో, సమీపంలోని దాబాలు, ఇళ్లలో సేదతీరడమో చేస్తున్నారు. సరుకులతో కూడిన వాహనాలు రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నా... ఆపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సరుకుల వాహనాన్ని చూసి హైవే మీదకు వెళ్లి అధికారులు చేయి ఊపిన ప్పుడు ఆపితే తనిఖీలు, లేదంటే వెళ్లిపోవడమే. దీంతో అక్రమ సరుకు వాహనాలు కూడా దొంగ వేబిల్లులతో యథేచ్ఛగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఐదెకరాలు అవసరం: నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు నిర్మాణానికి ఐదెకరాల భూమి అవసరం. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు నిర్మాణానికైతే 10 ఎకరాలు కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కనీసం రెండెకరాల స్థలంలో సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు రైతుల నుంచి భూమిని లీజు పద్ధతిన తీసుకొని... జాతీయ రహదారుల్లోని భూమికి నెలకు రూ.65,000, రాష్ట్ర రహదారుల్లో రూ.45వేలు అద్దె చెల్లించేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అయితే భూసేకరణ జరిపి శాశ్వత చెక్‌పోస్టులు నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఈ లెక్కన అప్పటివరకు ఎండ, వానల్లోనే అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచే యాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బందీ కరువే: వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని ప్రతి చెక్‌పోస్టులో ఒక డీసీటీవోతో పాటు షిఫ్టుల వారీగా ముగ్గురు ఏసీటీవోలు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పాటైన చెక్‌పోస్టుల్లో ఎక్కడా డీసీటీవో లేడు. ఏసీటీవోల ఆధ్వర్యంలో ఒకరిద్దరు సహాయకులతో బండి నడిపిస్తున్నారు. చెక్‌పోస్టులకు అవసరమైన సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తయితే... ఉన్నా కూర్చునేందుకు నీడ కూడా లేకపోవడం గమనార్హం. ఇక కర్నూలు సమీపంలోని తుంగభద్ర వద్ద, నల్లగొండ జిల్లా కోదాడ వద్ద రాకపోకలు సాగించే రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉండాలి. కానీ సిబ్బంది లేక ఏపీ నుంచి వచ్చేదారిలోనే తాత్కాలిక చెక్‌పోస్టులు పెట్టారు. ఉండాల్సిన సిబ్బంది 2 - రెండు జాతీయ రహదారులపై సీటీవోలు 7 - డీసీటీవోలు 53 - సీనియర్ అసిస్టెంట్లు 53 - ఏసీటీవోలు 77- జూనియర్ అసిస్టెంట్లు 102 - ఆఫీస్ సబార్డినేట్లు 294 - మొత్తంగా ఏడు చెక్‌పోస్టుల్లో మూడు షిఫ్టులకు అవసరమైన అధికారులు, సిబ్బంది 70 -ప్రస్తుతం ఉన్న సిబ్బంది సుమారు -
రూ.110 కోట్లతో చెక్‌పోస్టుల ఆధునీకరణ
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర సరిహద్దుల్లో సరకు అక్రమ రవాణాను నివారించే చర్యలకు వాణిజ్యపన్నుల శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 12 చెక్‌పోస్టులను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు సరకు అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా రూపొందించాలని నిర ్ణయించింది. ఇందుకోసం రూ. 110 కోట్లు విడుదల చేయాలని ఇటీవలే వాణిజ్య పన్నుల శాఖ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్ జిల్లా జోరజ్, నిజామాబాద్ జిల్లా తాలూరా గ్రామాల వద్ద రూ. 90 కోట్లతో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అధునాతన పద్ధతిలో రాష్ట్రం లోపలికి, బయటకు రాకపోకలు సాగించే ప్రతి వాహనం, వాటిలోని సరుకు వివరాలు ఇక్కడ నమోదవుతాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి అక్రమ సరకు ఈ రెండు మార్గాల గుండానే తెలంగాణలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మిగతా 10 చెక్‌పోస్టుల ఆధునీకరణకు మరో 20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. -
డిసెంబర్ ఆదాయం అదుర్స్!
రాష్ట్ర వనరుల ద్వారానే రూ. 3 వేల కోట్లకుపైగా ఆదాయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఆదాయం ఆశించిన దానికంటే అధికంగా వచ్చింది. రూ. 3 వేల కోట్లకుపైగా సొంత ఆదాయ వనరుల నుంచి లభించింది. పొరుగు రాష్ట్రంతో పోలిస్తే ఈ నెలలో ఆదాయం పెరగడం గమనార్హం. 2014 సంవత్సరం చివరలో ఆదాయం పెరగడంతో.. ఆర్థిక సంవత్సరం వచ్చే మూడు నెలల్లో ఆదాయం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే రవాణా శాఖ ఆదాయం మాత్రమే కాస్త తగ్గింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే యత్నాల్లో తలమునకలైంది. మొన్నటి వరకు వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో.. దానిపై సమీక్ష పెద్దగా జరగలేదు. దీనితో వచ్చిన ఆదాయమే బాగా ఉందనే ఉద్దేశంలో ఉన్నారు. నవంబర్‌లో ఈ ఆదాయం రూ. 2 వేల కోట్లకు దిగువకు పడిపోవడంతో ఈసారి ఆదాయాన్ని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లలోని లోపాలను సరిచేసుకుంటే.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ప్రధాన విభాగాలైన వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, గనుల ఆదాయంతో పన్నేతర ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది. గత నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే రూ. 22 వేల కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్లో వచ్చిన ఆదాయం విభాగాల వారీగా చూస్తే వాణిజ్యపన్నులు రూ. 2, 272 కోట్లు, మద్యం రూ. 205 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూ. 233 కోట్లు, రవాణా రూ. 170 కోట్లు, గనులు రూ. 52 కోట్లుగా ఉంది. అలాగే పన్నేతర ఆదాయం రూ. 100 కోట్లకు పైగానే లభించినట్లు తెలిసింది. అయితే ప్రతి నెలా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 2,700 కోట్ల మేరకు ఉంటోంది. కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఈ మధ్య కాలంలో సకాలంలోనే వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన మొదటి 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఏపీ ప్రభుత్వంలోనే జమకావడం విదితమే. -
ఢూం..ఢాం!
జోరుగా టపాసుల జీరో దందా * అక్రమార్కులకు దీపావళే..! * సర్కార్ ఖజానాకు భారీ గండి * కళ్లుమూసుకున్న ఆ నాలుగు శాఖలు * చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రూ.కోట్లకు కోట్ల దీపావళి సరుకు దిగుతోంది. అంతా అక్రమ దందా... జీరో మాల్. ఈ మాల్‌ను పట్టుకోవడానికి మన అధికారులు మాటేశారు. అవి టపాసులు కదా..! కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతేదో కమ్ముకొచ్చింది. ఆ కాంతికే వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాక, రెవిన్యూ శాఖల అధికారుల కళ్లు మూతలు పడుతున్నాయి. కళ్లు నలుసుకొని తెరిచి చూసే సరికి కంటి ముందు నోట్ల కట్టలు. ఇంకేముందు సార్లకు కాళ్లు కదలట్లేదు. నోళ్లు పెగలట్లేదు. నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ జీరో మాల్‌ను వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో వచ్చే రూ కోట్లకు గండి కొడుతున్నారు. ఆయన కన్ను గీటితే... దీపావళికి జిల్లాలో 2 వేల టపాసుల దుకాణాలు వెలుస్తాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.30 కోట్ల వ్యాపారం సాగుతుంది. ఇదంతా అనధికారిక లెక్క. జీరో దందా. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లు మూసుకోవడంతో సాగుతున్న అక్రమ వ్యాపారం. అలాగని చిన్నా చితక చిల్లర కొట్టు వ్యాపారులు లాభపడుతున్నది లేదు. ఒకే ఒక వ్యాపారి గుప్పిట్లోనే ఈ దందా నడుస్తోంది. రామచంద్రాపురానికి చెందిన ఈ వ్యాపారి కన్ను గీటితే... వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. సంగారెడ్డి, మెదక్, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, సదాశివపేట, సిద్దిపేట, నారాయణఖేడ్ పట్టణాల్లో దుకాణాల లెసైన్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా హోల్‌సేల్ వ్యాపారి అడ్డుకుంటున్నాడు. వాస్తవానికి పటాన్చెరు,సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట పట్టణాల్లో టపాసులకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ఇక్కడ వందల్లో దుకాణాలు వెలుస్తాయి. కానీ ఒక్క దుకాణానికి కూడా లెసైన్స్ ఉండదు. అక్రమ దందా దీపావళి పండగ సందర్భంగా టపాసులు విక్రయించాలనుకునేవారు దుకాాణాల ఏర్పాటుకు పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆధారంగానే రెవెన్యూ శాఖ అధికారులు (జిల్లా కలెక్టర్) క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు జారీ చేస్తారు. కానీ జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దుకాణాల్లో కొన్నింటికి మాత్రమే లెసైన్సులు ఉంటాయి. మిగతా వాటికి లెసైన్సులు తీసుకోకుండానే నిర్వహిస్తారు. తెచ్చిన సరుకుకు లెక్కాపత్రం ఉండదు. టకాపాయల అమ్మకాలను బట్టి వాణిజ్య పన్నుల శాఖకు 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 4 కోట్ల వరకు వాణిజ్య పన్నుల రూపంలో ఆదాయం రావాల్సి ఉంది, కానీ రూ. 4 లక్షల ఆదాయం కూడా సమకూరటం లేదు. నో అబ్జెక్షన్తోనే సరి దుకాణదారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌తోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిజానికి ఇలా అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై నాలుగు శాఖల అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వాటిని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ఏ అధికారి కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. కారణం ఏమిటంటే అక్రమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ప్రతి దుకాణానికి రూ.25 వేలు వసూలు చేసి అధికారుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోనైనా అధికారులు టపాసుల వ్యాపారంపై వచ్చే వాణిజ్య పన్నుల మీద దృష్టిపెడితే భారీగా ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది. -
ఏకీకృత పన్నుల విధానంతో మేలు
వ్యాట్ నుంచి జీఎస్టీ దిశగా పన్నుల మార్పు వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఏయూ క్యాంపస్ : పన్నుల విధానంలో ఏకీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఉద్యోగ సంఘాలు కృషి చేయాలని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ సూచించారు. సంఘం ఆధ్వర్యంలో ఏయూ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)పై శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యాట్ నుంచి నేడు జీఎస్టీ దిశగా పన్నులు మార్పు చెందనున్నాయన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా మనం ఎంతవరకు లబ్ధిపొందుతున్నామనే విషయం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పన్ను సంస్థలన్నీ సమైక్యంగా పనిచేయాలని సూచించారు. సదస్సు ముఖ్య సమన్వయకర్త, కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్ జి.లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో ఏకీకృత పన్నుల విధానం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఉద్యోగులు విస్తృత అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఐఎఫ్‌టీపీ కేంద్ర జీఎస్టీ కమిటీ చైర్మన్ ముకుల్ గుప్తా మాట్లాడుతూ జీఎస్టీ అమలు చేయాలంటే బలమైన కేంద్రం ఉండాలని, ప్రస్తుత పరిస్థితులలో ఇది సాధ్యపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాష్ట్రాలలో జీఎస్టీ అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో జీఎస్టీకి సామీప్యంగా భారత్‌లో దీన్ని రూపొం దిస్తున్నారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ న్యా య విభాగం రిటైర్డ అదనపు కమిషనర్ యోగేందర్ కుమార్, ట్యాక్స్ రెగ్యులేటరీ సర్వీసెస్ సభ్యుడు ప్రశాంత్ రైజాడా తదితరులు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ సంయుక్త కమిషనర్ పి.వి.సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ ఎస్.శేఖర్, విశాఖ డిప్యూటీ కమిషనర్ టి.శివ శంకరరావు, సంస్థ కార్యదర్శి జి.సత్యనారాయణ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
కదిలితే ఒట్టు!
వాణిజ్యపన్నుల శాఖలో బదిలీల తంతు ఫోకల్ పోస్టింగ్‌ల కోసం పైరవీలు ఏళ్ల తరబడి కదలని అధికారులు పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు విజయవాడ : రాష్ట్ర తాత్కాలిక రాజధాని, వాణిజ్య కూడలి విజయవాడ కేంద్రంగా కొలువుల కోసం వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, సిబ్బంది ఎవరిస్థాయిలో వారు చక్రం తిప్పుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా అక్రమ ఆదాయం వచ్చిపడే వాణిజ్యపన్నుల శాఖలో కుర్చీల కోసం పైరవీలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో హడావుడి మొదలైంది. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులకు జోనల్‌స్థాయి బదిలీలు జరగాల్సి ఉండగా... ప్రతీ ఏటా ఒకే కార్యాలయంలో కుండమార్పిడీల రీతిలో అక్కడికక్కడే సర్దుకుంటున్నారు. డీసీటీవో, సీటీవోస్థాయి అధికారులు రెండేళ్లకోసారి, కనీసం మూడేళ్లకోసారైనా బదిలీ అవాల్సి ఉంది. ఏలూరు, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు గెజిటెడ్ అధికారులు బదిలీ కావల్సి ఉండగా ఎవరికి కావాల్సింది వారికి ముట్టజెప్పి విజయవాడను వదలడం లేదని చెబుతున్నారు. రికార్డు అసిస్టెంట్ నుంచి డీసీటీవో క్యాడర్ వరకు విజయవాడలో ఒకే కార్యాలయంలో పనిచేసే వారు పలువురు తాజాగా మళ్లీ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నోఏళ్లుగా తిష్టవేసిన కొందరు అధికారులు ఆ సీట్లను వదలకపోవటంతో, నగరానికి బయట పని చేసే వారు అక్కడే మగ్గిపోతున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా విజయవాడలో 1డివిజన్, 2వడివిజన్లతోపాటు 16 సర్కిళ్లు ఉన్నాయి. ఎనిమిది సర్కిళ్లకు 16మంది డీసీటీవోలు, 48 మంది సీటీవోలు (ఇన్స్పెక్టర్లు)పనిచేస్తుంటారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు దాదాపు మరో140 మంది ఉన్నారు. వీరంతా తమ పలుకుబడితో విజయవాడ వదిలి వెళ్లకుండా ఉంటున్నారు. పదోన్నతుల పోస్టింగ్‌లోనూ నిబంధనలకు నీళ్లు ... రెండు రోజుల క్రితం వాణిజ్యపన్నుల శాఖలో 1, 2,డివిజన్ కార్యాలయాల్లో పని చేసే 20 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంటెంట్లుగా పదోన్నతి వచ్చింది. నిబంధనల ప్రకారం ఒక సర్కిల్లో పనిచేసిన వ్యక్తిని తిరిగి అదే డివిజన్లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించటానికి నిబంధనలు ఒప్పుకోవు.అయితే సంబంధిత అధికారులు ఆ నిబంధనలు గాలికి వదిలి పలువురిని గతంలో పనిచేసిన సర్కిల్లోనే పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. -
వాణిజ్య పన్నుల్లో తెలంగాణ వాటా 42%
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మే నెలకు వాణిజ్య పన్నుల కింద వసూలైన దాదాపు రూ. 4,600 కోట్లలో. తెలంగాణ రాష్ట్రానికి 42శాతం వాటా రావలసి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివరించారు. మే నెలాఖరువరకు వసూలైన వాణిజ్య పన్నుల ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతాలోకి జమ అయినందున, ఆ నిధుల్లో వాటా తెలంగాణ ఖజానాకు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులు ఈ నెల 24లోగా, తెలంగాణ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, వాణిజ్య పన్నుల ఆదాయం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను కోరినట్లు సమాచారం. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అదనపు పన్నులు మోపకుండా.. లొసుగులను తొలగించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. చెక్‌పోస్టులవద్ద నిఘాను కట్టుదిట్టంచేయడం ద్వారా ఆదాయం పెంచడంపై దృష్టిని కేంద్రీకరించాలని సీఎం సూచించారు. కేంద్ర అమ్మకం పన్నులకు సంబంధించి లాభకరమైన విధానం అమలుకు తగిన ప్రణాళికను రూపొందించాలని ఆయన వాణిజ్య పన్నుల కమిషనర్‌కు సూచించారు.