వైఎస్‌ఆర్ సీపీ నేతలపై బాబు కక్ష సాధింపు | Narayana Swamy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ నేతలపై బాబు కక్ష సాధింపు

Published Sat, Nov 22 2014 2:21 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

వైఎస్‌ఆర్ సీపీ నేతలపై బాబు కక్ష సాధింపు - Sakshi

వైఎస్‌ఆర్ సీపీ నేతలపై బాబు కక్ష సాధింపు

తిరుమల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ ప్రజా సంక్షే మ కార్యక్రమాలపై దృష్టి సారించ కుండా ప్రతి పక్షంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై దౌర్జన్యంగా కేసులు పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు మక్కువ చూపుతున్నారని అన్నారు.

అసెంబ్లీలో ప్రమాణం చేసిన విధంగా ప్రజలందరికీ సమాన పరిపాలన అందించటంలో బాబు విఫలమవుతున్నారన్నారు. ఎటువంటి కక్షలు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించాలని స్వామి సన్నిధి నుంచి ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు తెలిపారు. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించి కుంటుపడిపోయిన అభివృద్ధిపై దృష్టిసారించేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. రాజకీయలకు అతీతంగా ప్రతి ఒక్క నేత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement