
ముస్లిం కాలనీలో చీరలు పంపిణీ చేస్తున్న దాత కేశవరెడ్డి, ఎమ్మెల్యే నారాయణస్వామి
కార్వేటినగరం: నాలుగేళ్లుగా ఏ హామీ నెరవేర్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లగుతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. ఆదివారం స్థానిక ముస్లిం కాలనీలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి 400 మందికి ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చీరలు అందజేశారు. కేశవరెడ్డి దాతృత్వాన్ని ఆయన అభినందించారు. ముస్లింలు రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో వస్తున్న ఆదరణను చూసి తెలుగుదేశం నాయకులు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పడు నవ నిర్మాణ దీక్ష పేరుతో దగా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ధనుంజయవర్మ, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అమీద్ ఖాన్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బండి జగదీష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింరంజీవి రెడ్డి, మండల యువత అధ్యక్షుడు ధనశేఖర్ యాదవు, శేషాద్రి, పట్నంప్రభాకర్‌రెడ్డి, పురుషోత్తంరాజు, పయణిరెడ్డి, మురగయ్య, అమీద్, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.