
సాక్షి, చిత్తూరు: ఈనాడు,రామోజీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఆధారాలు బయటపెట్టారు.. కానీ ఈనాడు పత్రికలో ప్రచురించలేదు. నవరత్నాలు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఏనాడు ఈనాడులో ఒక్క మంచి వార్త కూడా రాలేదు’’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు.
‘‘ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. అందులో రామోజీరావు పాత్ర ఉంది. అను నిత్యం సీఎం జగన్‌పై విషం చల్లుతున్నారు. రామోజీరావు తాటాకు చప్పుళ్లకు వైఎస్ జగన్ భయపడరు’’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
చదవండి: డబ్బున్నవాళ్లే పేదల్ని ఆదుకోవాలా?