చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌ | Minister Narayana Swamy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌

Aug 27 2021 2:52 PM | Updated on Aug 27 2021 4:03 PM

Minister Narayana Swamy Fires On Chandrababu - Sakshi

అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని.. నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తనకు రాసిస్తారా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌ విసిరారు.

సాక్షి, తిరుపతి: అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని.. నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తనకు రాసిస్తారా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌ విసిరారు. తాను రాజకీయాలలోకి వచ్చి అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు.

‘‘నాపై ఆరోపణలు అవాస్తవాలని కాణిపాకంలో ప్రమాణం చేస్తా. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలి. ఎస్సీ, ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఇద్దరు ఎస్సీలను అడ్డు పెట్టుకుని విమర్శలు చేయిస్తున్నారంటూ’’ నారాయణ స్వామి నిప్పులు చెరిగారు.

ఇవీ చదవండి:
శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement