సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దేశీయంగా ఉత్పాదక శక్తిని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క జోన్ ఏర్పాటుకు అనుమతివ్వగా, మన రాష్ట్రంలో రెండు జోన్లకు అనుమతి వచ్చింది. ఒకటి మెదక్ జిల్లాలో, రెండోది చిత్తూరు జిల్లాకు మంజూరైంది.
అయితే ప్రాంతీయ సమతుల్యతలను దృష్టిలో ఉంచుకుని కోస్తాంధ్రలోని ప్రకాశం జిల్లాలో కూడా ఒక నిమ్జ్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. గత ఏడాది జూన్, జూలై నెలల్లో ఈ అనుమతులు లభించగా.. చిత్తూరు, మెదక్ జిల్లాల్లో జోన్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. మెదక్ జోన్‌లో దాదాపు 12,500 ఎకరాల భూమిని ఇప్పటికే గ్రహణం
సేకరించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని కలికిరి వద్ద కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం ఇంతవరకు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం భూ సేకరణ కూడా ప్రారంభం కాలేదు.
రూ30 వేల కోట్ల పెట్టుబడులు
నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు ఐదు వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో దాదాపు రూ30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వేలాది ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ (జీడీపీ) 14 శాతం ఉండగా, దాన్ని 2022 నాటికి 25 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే నిమ్జ్‌లకు అనుమతిచ్చింది.
చైనా ముందుకొచ్చినా...
చిత్తూరు జోన్‌లో పరిశ్రమలు పెట్టడానికి జపాన్ ముందుకు రాగా, మెదక్‌లో పరిశ్రమలు పెట్టేందుకు మహీంద్ర లైఫ్ స్పేసెస్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చైనా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు భూసేకరణ కూడా ప్రారంభం కాకపోవడంతో, చైనా సంస్థలు మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. నిమ్జ్ ఏర్పాటైన తరువాత జర్మనీ, రష్యాల నుంచి కూడా కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. నిమ్జ్ ప్రారంభమై పరిశ్రమలు వస్తే జిల్లాలో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల ఈ సదవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంది.
‘నిమ్జ్’కు గ్రహణం
Published Thu, Jan 30 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement