పవిత్రమైనది ఓటు హక్కు | National Voters Day | Sakshi
Sakshi News home page

పవిత్రమైనది ఓటు హక్కు

Published Sun, Jan 25 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

National Voters Day

 శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దీన్ని పవిత్రంగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహాం అన్నారు. జాతీయ ఓటర్ల  దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు మహా ఆయుధమన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును పొందాలని, ఎన్నికల్లో వినియోగించు కోవాలన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అలాగే శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో జిల్లాస్థాయి ఓటర్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ వివేక్ యాదవ్, ఏజేసీ పి.రజనీకాంతారావు, జెడ్పీ సీఈవో జె.వ సంతరావు, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, డివిజినల్ అటవీ శాఖ ఆధికారి షెక్ షలాం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement