► జూలై 24న నీట్ పరీక్ష
► ఆందోళనలో మెడిసిన్ ఎంసెట్ విద్యార్థులు
► తల్లిదండ్రులపై అదనపు భారం
► ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం మెడిసిన్ ఎంసెట్ విద్యార్థులకు శాపంగా మారింది. సంవత్సరమంతా ఒక సిలబస్ చదివి ఇప్పుడు నీట్ పరీక్ష సీబీఎస్‌సీలో రాయాలనడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులపై అదనపు భారంతోపాటు సమయం వృథా అయిందని విద్యార్థులు కుమిలిపోతున్నారు. కోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు.
సాక్షి, చిత్తూరు : మెడిసిన్ ఎంసెట్ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ‘నీట్’గా ముంచేసింది. డాక్టర్ కావాలనుకునే వారంతా కచ్చితంగా నేషనల్ ఎలిజబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) రాయాలని సుప్రీం తీర్పునివ్వడంతో విద్యార్థులు ఆందోళనలోపడ్డారు. జూన్ 24న నీట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులపై అదనపు భారం పడిందని, సమయం వృథా అయ్యిందని పలువురు వాపోతున్నారు.
గందరగోళం
మూడేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా నీట్‌పై చర్చ జరుగుతోంది. దానికి తగినట్లుగా పాఠ్యాంశాలను మార్పు చేయలేదు. ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య సీట్ల భర్తీలో ప్రవేశాలకు ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేయడంతో జిల్లాలో మెడిసిన్ ఎంసెట్ రాసిన 5,860 మంది విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.
ముందు చూపేదీ?
ప్రభుత్వానికి ముందు చూపు లేక వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీట్ వ్యవహారం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందని తెలిసినా ఎంసెట్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ తప్పనిసరి అయినప్పుడు దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లయితే వారు ఇప్పటికే చదువుకొని ఉండే వారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రెండింతల ఖర్చు
ఎంసెట్ కోచింగ్‌కు తల్లిందండ్రులు ఎంతలేదన్నా సంవత్సరానికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నీట్‌కు తమ పిల్లలను చేర్పించాలంటే మరింత భారం మోయాల్సి వస్తోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. నీట్ కోసమని ఇప్పుడు కొత్తగా కోచింగ్ సెంటర్లు వెలిశాయని, తిరుపతిలో దాదాపు నాలుగు సెంటర్లు ఉన్నాయని, అక్కడ ఒక్కో విద్యార్థికి రూ.25 వేల(భోజన ఖర్చులతో కలిపి) వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ ప్రశ్నలకు జవాబులేవీ?
► నీట్ ఉంటుందని తెలిసినప్పుడు ఎంసెట్ ఎందుకు నిర్వహించినట్లు?
► సిలబస్‌లో ఎందుకు మార్పులు చేయలేదు?
► నీట్‌పై ఎందుకు అవగాహన కల్పించలేదు?
► ఎంసెట్‌లో మంచి ర్యాంకులు తెచ్చుకొని.. నీట్‌లో రాకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి?
అవగాహన కల్పించాల్సింది
నీట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమయింది. జాతీయ స్థాయిలో పరీక్ష రాస్తున్నప్పుడు దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం రెట్టింపయ్యింది. - పురుషోత్తం రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త, తిరుపతి
తొందరపాటు చర్య
నీట్ పరీక్షతోనే వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్న నిర్ణ యం తొందరపాటు చర్యగా ఉంది. బైపీసీ విద్యార్థులు నష్టపోతారు. నీట్ ప్రశ్నపత్రం సీబీఎస్ సిలబస్ తరహాలో ఉంటుంది. -మురళి నారాయణ, ఐఐటీ సీనియర్ లెక్చరర్
మంచిదేగానీ..
మేము ఎంసెట్ పరీక్ష రాసే స మయం నుంచే నీట్ పరీక్ష ప్రస్తావన ఉంది. ఈ విధానం మంచి దే గానీ విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమయినతర్వాత ప్రకటించడం అన్యాయం. ఏడా ది ముందే తెలిసి ఉంటే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండేది. - యమున సాయి, బైపీసీ, విద్యావికాస్ కళాశాల
వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలి
ఇప్పటికిప్పుడు నీట్ అమలు చేయడం మంచిదికాదు. ఏడాది పొడువునా ఒక సిలబస్‌లో ప్రి పేరై చివరిలో మరో సిలబస్‌లో పరీక్ష రాయాలంటే మాటలా?. మాకు న్యాయం చేయాలి. - విజయకుమారి, బైపీసీ, విద్యావికాస్
ప్రాంతీయ భాషలోనే ప్రశ్నపత్రం ఇవ్వాలి
నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఆంగ్లం, హిందీలోనే ఇస్తారు. తెలుగు మాధ్యమం విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. వారికి ఆంగ్లంపై పట్టుఉండదు. కాబ ట్టి నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఏడాది మినహాిహ ంపు ఇస్తే విద్యార్థులకు న్యాయం కల్గుతుంది. - శ్రీనివాసులు,
ప్రిన్సిపాల్, నారాయణ కళాశాల
ఒకే సిలబస్ అమలు చేసిన తర్వాతే..
దేశంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు ఒకటే సిలబస్‌ను అమ లు చేసిన తర్వాతే నీట్ జరపాలి. అలాచేస్తే చిన్నతనం నుంచే సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. ఇప్పుడు నీట్‌లో రాయాలనడం సబబుకాదు. - గీత, బైపీసీ, నారాయణ
నీట్‌గా ముంచేశారు..
Published Mon, May 16 2016 3:46 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Advertisement