నిపుణులతో చర్చిస్తున్నాం: జేపీ నడ్డా
న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాలకోసం నిర్వహించనున్న నీట్ పరీక్షపై రెండ్రోజుల్లో నిర్ణ యం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. నీట్ పై వివిధ రాష్ట్రాలతోపాటు పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో.. న్యాయ నిపుణులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామంది. ‘ఇక్కడ మూడు సమస్యలున్నా యి. నీట్ పరీక్షతోపాటు.. సిలబస్, భాష. వీటిపై ఓ స్పష్టమైన నిర్ణయానికి రావాలి. దీనిపై సరైన దిశలోనే ముందుకెళ్తున్నాం. అందరినీ సంప్రదిస్తున్నాం. రెండ్రోజుల్లో స్పష్ట త వస్తుంది’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు.
తెరపైకి వచ్చిన సమస్యలకు పరిష్కారం ఇవ్వకుండా నీట్‌పై ముందుకెళ్లటం అసాధ్యమే.. అందుకే దీనిపై స్పష్టమైన అవగాహన ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలై 24న నీట్ రెండో విడత పరీక్ష జరగనుంది. అయితే ఈ వివాదానికి సంబంధించి అన్ని న్యాయపరమైన మార్గాలను అన్వేషించాలని రాష్ట్రాలకు సూచించినట్లు నడ్డా చెప్పారు. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు మాత్రం నీట్ ద్వారానే ప్రవేశాలు జరపాలన్నారు. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేసేందుకు ఆర్డినెన్సు తేవా లని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
నీట్‌పై రెండ్రోజుల్లో నిర్ణయం
Published Thu, May 19 2016 1:34 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement