కర్నూలు(అర్బన్): కర్నూలు నుంచి కోడుమూరు మీదుగా బళ్లారికి వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఇదే రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తున్నా.. ఈ రోడ్డుకు మోక్షం లభించక పోవడం దురదృష్టకరం. కర్నూలు నుంచి కోడుమూరుకు చేరుకోవాలంటే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి గంట సేపు గుంతల రోడ్లపై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. 2011 జనవరి 1న ప్రపంచ బ్యాంకు నిధులతో కర్నూలు నుంచి దేవనకొండ వరకు కొత్త రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
హైదరాబాద్‌కు చెందిన రాణి ఇన్‌ఫ్రా కంపెనీ రూ.72 కోట్లకు కోట్ చేసి పనులను దక్కించుకుంది. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసేలా సంబంధిత కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన 2014 నాటికి రోడ్డు పనులను పూర్తి చేయాల్సి వుంది. అయితే కాంట్రాక్టు షరతుల ప్రకారం సంబంధిత లెసైన్సులు, పర్మిట్లు, మెటీరియల్ కొనుగోలు, ఎక్సైజ్ సుంకం మినహాయింపు తదితర లాంఛనాలన్నీ ముగిసేనాటికి ఏడాది గడచిపోయింది. అనంతరం కోడుమూరు ఊరి చివరి నుంచి ప్యాలకుర్తి గ్రామ శివార్ల వరకు (10 కిలోమీటర్లు) కాంట్రాక్టర్ పనులను చేపట్టారు.
విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా దాదాపు మూడు అడుగల మేర మట్టిని తొలగించి కంకర, ఎర్రమట్టితో కొంతమేర రోడ్డును పూడ్చి వేశారు. అయితే కొందరు నేతలు రంగంలోకి దిగి రాణి ఇన్‌ఫ్రా ప్రతినిధులతో కాసుల భేరం పెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. కారణాలు ఏవైనా పనులు మాత్రం అర్ధాంతంతరంగా ఆగిపోయాయి. దీంతో కోడుమూరు నుంచి కొత్తూరు గ్రామం వరకు రోడ్డును ఇరువైపులా తవ్వి వదిలేయడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డును ఆనుకొని మూడు అడుగులకు పైగా కొత్త రోడ్డు కోసం గుంత తవ్వి వదిలేయడంతో పాత రోడ్డును ఆనుకుని దాదాపు 3 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తి అధ్వానంగా తయారైంది.
దారిద్య్రం
Published Fri, Aug 22 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement