సాక్షి, నెల్లూరు ప్రతినిధి: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నెల్లూరు కార్పొరేషన్ పరిస్థితి తయారైంది. అభివృద్ధి ఊసే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయారు. దీంతో కార్పొరేషన్‌లో రోజురోజుకూ అప్పులు పేరుకుపోతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక కార్పొరేషన్ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్ చెల్లించాల్సిన అప్పులు సుమారు రూ.41 కోట్లకు పైమాటే. వివిధ రకాల పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అధికారులు అటూ ఇటూ మారుస్తూ నెట్టుకొస్తున్నట్టు సమాచారం.
అందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ఓఎఫ్‌సీ కేబుల్ ఏర్పాటులో భాగంగా రోడ్ల పునరుద్ధరణకు విడుదల చేసిన నిధులను బకాయిపడ్డ కాంట్రాక్టర్లకు చెల్లింపే ఇందుకు నిదర్శనం. మొత్తంగా ఆరునెలలుగా నెల్లూరు నగరం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కాంగ్రెస్ హయాంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. రెవెన్యూ మంత్రి నెల్లూరు వారే కావటంతో నిధులకు ఢోకాలేదని భావించారు. నిధులైతే మంజూరు చేయించుకున్నారు కానీ.. పనులు పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అభివృద్ధి పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
కష్టాల్లో కార్పొరేషన్
Published Tue, Dec 9 2014 3:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM
Advertisement
Advertisement