నెల్లూరు, సిటీ : టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఏ విధమైన చేయూతనివ్వలేదనే విమర్శలొస్తున్నాయి. అభివృద్ధి కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయనే ఆరోపణలొస్తున్నాయి. హడ్కో నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు దాని ఊసే లేకుండాపోయింది. కౌన్సిల్ ఏర్పడిన ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించారు. అందులో ఒకటి బడ్జెట్ సమావేశం. స్టాండింగ్ కమిటీ ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సమావేశం నిర్వహించి సరిపెట్టుకున్నారు. ఈ విషయాన్ని గమనిస్తే చాలు కార్పొరేషన్‌లో అభివృద్ధి ఏమాత్రం ఉందనేది తెలుస్తుంది.
నేటికి కౌన్సిల్ సమావేశం నిర్వహించి 181 రోజులు..
నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు తీసుకోవాలటే కౌన్సిల్లో చర్చించాలి. అటువంటిది ఏమీ లేకుండా మేయర్, అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ విషయాన్ని కౌన్సిల్‌లో చర్చించకుండానే జరిగిపోయింది. మంత్రి నారాయణ ఆదేశాలతో మేయర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మూడు నెలలకు ఒక సారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నాయకులు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కోరినా ఫలితం లేదు.
స్టాండింగ్ కమిటీ ఉన్నట్లేనా..?
ఐదుగురు సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఉంటుంది. కార్పొరేటర్లతో వారానికి ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్టాండింగ్ కమిటీలో చర్చించిన తర్వాతే అమలు చేయాలి. అదేమీ లేకుండా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎవరికి వారుగా ఉన్నారు. ఐదు నెలల కాలంలో ఒక్క సమావేశం మాత్రమే నిర్వహించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఉన్నా లేనట్టేనని కార్పొరేషన్‌లో చర్చించుకుంటున్నారు.
ప్రతిపాదనలకే అభివృద్ధి పరిమితం
Published Fri, Aug 7 2015 2:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM
Advertisement