
పబ్లిక్ మీటింగ్ లకు సరికొత్త మొబైల్ స్టేజ్!
హైదరాబాద్: వివిధ రకాల బుల్లికార్ల రూపకర్త సుధాకర్ తాజాగా మొబైల్ స్టేజ్ (డయాస్) వాహనాన్ని రూపొందించారు. ప్రస్తు తం ఎన్నికల సీజన్ కొనసాగుతున్న నేపథ్యం లో.. అందరికీ ఉపయోగపడేలా దాదాపు 10 అడుగుల ఎత్తు ఉన్న మొబైల్ స్టేజ్ వాహనాన్ని తయారు చేశారు. ఎలాంటి వెల్డింగ్‌లు లేకుండా అప్పటికప్పుడే ఫిట్ చేసుకుని కార్యక్రమం అనంతరం తొలగించుకునే వెసలుబాటు కల్పించారు. టాటా జినాన్ పికప్ వ్యాన్‌ను ఈ విధంగా తయారు చేసి సోమవారం బహదూర్‌పురాలోని సుధాకర్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పబ్లిక్, కార్నర్ మీటిం గ్‌లు జరిగేటప్పుడు ఈ స్టేజ్‌పై దాదాపు 12 మంది నిలబడి మీటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉందన్నారు. వివిధ పార్టీలకు అవసరమైన రీతిలో మొబైల్ స్టేజ్‌లో మార్పులు సైతం చేయనున్నట్లు ఆయన తెలిపారు.