Public meetings
-
అవుట్ డేటెడ్ స్పీచ్ తో.. చంద్రబాబు అబద్దపు హామీలు
-
2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్
నిజామాబాద్: 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల అండ ఉంటుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం:కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తోందని అన్నారు. రైతు దుబారానా? అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎండగట్టారు. ఈ ప్రాంతానికి ఆనాడు నీళ్లు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు లాంటి పథకాలను దేశంలో తెలంగాణ మాత్రమే అమలు పరుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని మత కలహాలు సృష్టించిందని విమర్శించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందని ఆరోపించారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీగాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామని వెల్లడించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు! -
ఆరు రోజులపాటు తెలంగాణలో రాహుల్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ నెత 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్.. 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. నవంబర్ 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ.. అదే తేదీలో పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకేరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. -
బహిరంగ సభలతో బీజేపీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహిరంగసభలతో హోరెత్తించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వచ్చే అకోబ్టర్ నెలలో 30 నుంచి 40 సభలు ఏర్పాటు చేసి పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్రణాళిక రచించింది. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లపాలనలో ప్రజల్లో పార్టీకి సానుకూలత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమైంది. 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల పరిధిలో సభల నిర్వహణ ద్వారా ‘కార్పెట్ బాంబింగ్’చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రజల మేలుకు తీసుకునే నిర్ణయాలు వివరించేందుకు సభల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడ్డాక...ఒకటొకటిగా ఈ సభల నిర్వహణ వేగం పెంచి ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి మొత్తం రాష్ట్రమంతా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అక్టోబర్1న మహబూబ్‌నగర్ జిల్లాలో, 3న నిజామాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు, బహిరంగసభల ద్వారా రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. అక్టోబర్ 6న బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ. నడ్డా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆ రోజున జరిగే విస్తృతస్థాయి రాష్ట్రకౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేస్తారు. అక్టోబర్ 7న ఆదిలాబాద్‌లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సభ ఉండే అవకాశాలున్నాయని పార్టీ ్టవర్గాల సమాచారం. కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర పదాధికారులు సీనియర్ నేతల సమావేశంలో జరిగింది. ఓబీసీ మోర్చా జాతీయఅధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, వివేక్‌వెంకటస్వామి, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్‌రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు పాల్గొన్నారు. సమావేశా నంతరం రాష్ట్ర ప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే వేలకోట్ల నిధులు కేటాయించిందని, మరిన్ని అభివృద్ధి పనుల నిమిత్తం అక్టోబర్ 1న మధ్యా్డహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్‌లో బహిరంగసభ, అక్టోబరు 3న మధ్యా హ్నం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సభ ఉంటుందని చెప్పారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన పనులతో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులపై ప్రకటన చేస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. -
Telangana: హోరెత్తేలా బీజేపీ అగ్రనేతల సభలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల వరుస బహిరంగ సభలతో రాష్ట్రాన్ని హోరెత్తించాలని బీజేపీ నాయకత్వం నిర్ణ యించింది. వచ్చేనెల రెండోవారంలోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయన్న అంచనాలతో.. రాష్ట్రమంతా ఒకేసారి బీజేపీకి ప్రజల్లో సానుకూలత పెంచడంతో పాటు పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లేదన్న ఉద్దేశంతో ఈ నెల 26 నుంచి 14 రోజులు మూడు ప్రాంతాల నుంచి తలపెట్టిన రథ (బస్సు) యాత్రలను పార్టీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ యాత్రలకు బదులు అగ్రనేతల బహిరంగ సభలతో రాష్ట్రంలో కార్యకలాపాలు వేగం పుంజుకునేలా చేయా లని జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఉ మ్మడి జిల్లాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలు కవరయ్యేలా మోదీ, అమిత్‌షా, నడ్డాల త్రయంతో సభల నిర్వహణకు ప్ర ణాళికలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే 2, 3 వారాల్లోనే వరుస సభల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2, 3 తేదీల్లో మోదీ పర్యటన? బీజేపీ కార్యాచరణలో భాగంగా వచ్చేనెల 2, 3 తేదీల్లో ప్రధా ని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల పరిధిలో కనీసం రెండుచోట్ల రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించాలనే ఆలోచనతో పార్టీ నాయకులున్నట్టు సమాచారం. అదేవిధంగా మిగతా ఉమ్మడి జిల్లాలను కవర్ చేసేలా అమిత్ షా, నడ్డాల సభలు కూడా ప్లాన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీలోగా అమిత్‌షా సభలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే అగ్రనేతల పర్యటనలు, వారు పాల్గొనబోయే బహిరంగ సభలకు సంబంధించి షెడ్యూల్ ఖరారయే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్ర తిపక్ష కాంగ్రెస్ తేరుకునే లోగానే అగ్రనేతల విస్తృత పర్యటనలు పూర్తిచేసేలా షెడ్యూల్‌కు రూపకల్పన చేస్తున్నారు. జన సామాన్యంలోకి వెళ్లేలా.. తొమ్మిదేళ్లలో కేంద్రంలో బీజేపీ సర్కార్ సాధించిన అభివృద్ధి, అవినీతి రహిత పాలన, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన లబ్ధి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆ రోపణలు, ప్రధానమైన హామీలు సైతం నెరవేర్చక పో వడం తదితర అంశాలు బీజేపీ అగ్రనేతలు ప్రస్తావించ వచ్చని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా తీరు, అవినీతి ఆరోపణలు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం లాంటివి వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విధంగా నిర్వహించే ప్రచారం ద్వారా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. -
తెలంగాణలో కమలం ఉద్యమపథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతున్న తీరు, పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీకి గానూ కొన్ని మాత్రమే పూర్తికావడాన్ని ప్రధాన సమస్యల్లో ఒకటిగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. పార్టీ పరంగా చేపట్టబోయే ఆందోళనల్లో ఆయా వర్గాలకు చెందిన బాధిత ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగా... అమెరికా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తిరిగి రాగానే ఈ నెల 20న నగరానికి సమీపంగా ఉన్న బాటసింగారంలో డబుల్ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తారు. 24న జిల్లా కేంద్రాల్లో నిరసన రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా డబుల్ ఇళ్లనిర్మాణంపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ధరణితో సహా రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 21న కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ... ప్రస్తుతం ఆషాఢమాసం కావడం, విదేశీ పర్యటనల్లో ఉండటంతో ఈ నెల 21న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, వ్యూహాలపై ఈ నెల 22న జరగనున్న కోర్ కమిటీ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ వర్గాల ప్రజలు, మేధావులను (30 వేల మందిని) కలుసుకుని పార్టీకి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో భాగస్వాములై తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ శాసనసభా స్థానాల్లో చేపట్టే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఒక్కో అసెంబ్లీ సీటు పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనరల్ సీట్ల పరిధిలో సభలు జరుపుతారు. వచ్చేనెల 15 లోగా ఈ సభలను పూర్తిచేయాలని నిర్ణయించారు. 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల బస ఆగస్టు 16 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు (ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున) వారం రోజులపాటు బస చేస్తారు. అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన, పార్టీ బలం, బలహీనతలు తదితర అంశాలను పరిశీలించి జాతీయ నాయకత్వానికి వారు నివేదికలు ఇవ్వనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
‘పీపుల్స్ మార్చ్’కు అతిరథులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మార్చి 16న ప్రారంభమైన భట్టి యాత్ర ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మీదుగా ఈ నెల 16న రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో అడుగుపెట్టింది. 17న యాత్ర ఇదే మండలంలోని రుక్కంపల్లికి చేరుకుంది. ఇప్పటివరకు 25 నియోజకవర్గాల్లో 800 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. అయితే వడదెబ్బతో డాక్టర్ల సూచన మేరకు 18 నుంచి యాత్రకు విరామం ప్రకటించారు. నాలుగు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో మళ్లీ పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా మరో మూడు చోట్ల బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన జాతీయ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26న జడ్చర్లలో సభ నిర్వహణకు శ్రీకారం చుట్టగా.. ముఖ్యఅతిథిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రానున్నట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలో లక్ష మందితో బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సభకు అగ్ర నేత ప్రియాంకాగాందీని, ఖమ్మంలో ముగింపు సందర్భంగా మూడు లక్షల మందితో నిర్వహించే సభకు రాహుల్‌గాందీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ సభలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా.. తేదీల ఖరారుపై స్పష్టత రావాల్సి ఉంది. వడదెబ్బతో యాత్రకు కొంత విరామం ప్రకటించామని.. అయినా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. -
జీవో నెంబర్ 1పై దుష్ప్రచారం.. ఏపీ అడిషనల్ డీజీపీ క్లారిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై జరగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అదికూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ జీవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. అందుకే వద్దన్నాం ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారుల మీద సభలు వద్దన్నామని లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లమీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని పేర్కొన్నారు. చదవండి: మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు -
AP: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో.. అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చు. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. సభ, ర్యాలీ నిర్వహణలో షరతులను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది. -
వారం రోజుల పాటు కమలం ‘హంగామా’!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో దూకుడుగా ముందుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వచ్చేనెల 2 నుంచి నాలుగో తేదీ వరకు సమావేశాలు జరగనుండగా.. అంతకు నాలుగు రోజుల ముందు నుంచే కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్లో జోష్ పెంచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. మొత్తంగా ఈ నెల 28 నుంచి వచ్చేనెల 4 దాకా (వారం పాటు) జిల్లాల్లో పర్యటనలు, కార్యవర్గ భేటీ, బహిరంగసభకు సంబంధించిన ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణకు బీజేపీ అగ్రనాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తి బీజేపీనేని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 3న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని.. దానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను, వివిధ వర్గాల ప్రజలను సమీకరించాలని నిర్ణయించింది. ప్రధానంగా బూత్ కమిటీల నుంచీ కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది. అనుకూల వాతావరణంపై ప్రచారం! తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని చాటాలని.. జాతీయ కార్యవర్గ భేటీకి చేస్తున్న ఏర్పాట్లను ఇందుకు ఉపయోగించుకుని, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే.. అన్నివర్గాల వారి సమస్యలు పరిష్కారమవుతాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయనే భరోసాను ప్రజలకు కల్పించాలని నేతలకు సూచించింది. ఈ క్రమంలోనే జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీకి అనుకూల వాతావరణం కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 28 నుంచే ఫుల్‌జోష్! రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 దాకా (4 రోజులు) పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు, పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు తెలంగాణవ్యాప్తంగా పర్యటించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాంతాల వారీగా గ్రూపులు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో 3, 4 రోజులు పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రం అమలుచేస్తున్న పథకాలు, తమ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుకు నోచుకోకపోవడం వంటి అంశాలను ఎత్తిచూపేలా ప్రచారం చేయనున్నారు. 2వ తేదీ నుంచి మొదలయ్యే కార్యవర్గ సమావేశాలు, 3న పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ, అమిత్‌షాల సభ విజయవంతానికి ఈ పర్యటనలు దోహదపడతాయని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక జాతీయ భేటీ, బహిరంగ సభ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఈనెల 28న అన్ని జిల్లాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
అనంతపురం భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి శంకర్ నారాయణ
-
ప్రజలను చైతన్యపరిచేందుకే సామాజిక న్యాయభేరి
శ్రీకాకుళం రూరల్/విజయనగరం అర్బన్: ప్రజలను చైతన్యపరచడమే సామాజిక న్యాయభేరి ఉద్దేశమని రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ యాత్రలో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెదపాడు క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి ధర్మాన పార్టీ నేతలతో మాట్లాడగా, మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఈనెల 26న శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్లో బహిరంగం సభ అనంతరం అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 27న విశాఖపట్నం, 28న పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. దేశంలోనే బ్యాక్వర్డ్ క్లాస్‌లకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలో తెలియజేస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బడుగు, బలహీనవర్గాల వారున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యాన్ని దాదాపు 50% మంది బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ అప్పగించారని తెలిపారు. రాజ్యసభ సీట్లను తెలంగాణ వారికి ఇవ్వడాన్ని తప్పుగా ప్రసారం చేస్తున్న ఏబీఎన్ చానల్.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లను ఆ రాష్ట్రవాసులకే ఇవ్వాలనే నిబంధనలు లేవని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ఇప్పటికే ఆయనపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. తప్పుచేసిన వారిపై ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలను ఈ వేసవి సెలవుల్లోనే చేపడతామన్నారు. మంత్రి బొత్స వెంట జెడ్పీ చైర్మన్ మజ్జి సీతారాం, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులున్నారు. -
Sakshi Cartoon: బహిరంగ సభల్లో జనం జేబులు కొట్టేస్తున్న దొంగలు!
మీరు జనం చెవుల్లో పూలు పెడుతున్నారు.. మేం జేబులు కొడుతున్నాం అంతే అంటున్నాడ్సార్! -
క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన ముంబైలో వేసవి ఎండలతోపాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. గల్లీల్లో జరుగుతున్న రాజకీయ సభలు, ఆ తర్వాత వివిధ మతాల ఉత్సవాలు, రాజకీయ నేతల హెచ్చరికలు, వివిధ సంఘటనల ఆందోళనల కారణంగా ముంబైలో ఏ క్షణంలోనైనా శాంతి, భద్రతలు అదుపు తప్పే అవకాశాలున్నాయి. దీంతో గత 20 రోజుల నుంచి ముంబైలో జరుగుతున్న నేరాల ను అదుపు చేయడంతోపాటు బందోబస్తు, శాంతి, భద్రతలను కాపాడటం పోలీసులకు నిత్యకృత్యమైంది. దీంతో నగర పోలీసులపై అదనపు పని భా రం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కంటే స్టేట్ రిజర్వుడు పోలీసు ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) బలగాలను మరింత పెంచాల్సి వచ్చింది. వరుసగా పండుగలు..వివాదాలు.. ప్రపంచంలో లేదా దేశంలో ఎక్కడా అల్లర్లు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు, ఇతర ఎలాంటి ఘటనలు జరిగినా ముందుగా ముంబై నగరాన్ని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే లౌడ్‌స్పీకర్లపై చేసిన ప్రకటన యావత్‌దేశంలో వివాదాస్పదంగా మారింది. రాజ్ ఠాక్రే చేసిన ప్రకటనతో ముంబై, మహారాష్ట్ర సహా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం నడుస్తుండగానే రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఇంటిపై ఆర్టీసీ ఉద్యోగులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రై డే, హనుమాన్ జయంతి, ఈస్టర్, వచ్చే నెలలో మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఆ తర్వాత 3న రంజాన్ ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు వస్తున్నాయి. మే మూడో తేదీలోపు మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తొలగించాలని రాజ్‌ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ఎదుట అంతకు రెట్టిం పు లౌడ్స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని హెచ్చరించారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. చదవండి: (హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!) నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముంబైలో గట్టి పోలీసు బందో బస్తూ ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు రికార్డు ల్లో నేర చరిత్ర ఉన్న నేరస్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. మోహళ్ల కమిటీ, శాంతి కమిటీ, సామాజిక సంస్థలు, ఉత్సవ మండళ్ల ప్రతినిధులు, అన్ని మత గురువులతో సమావేశం నిర్వహించారు. నేరశాఖ పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మత ఘర్షణలు సృష్టించే సందేశాలను, పోస్టులను తొలగించారు. కొత్త వివాదానికి తెరలేపిన రాణా దంపతులు శాంతి భద్రతలను అదుపులో ఉంచే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవీ రాణా బాంద్రా కళానగర్‌లోని మాతోశ్రీ బంగ్లా ఎదురుగా హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి కొత్త వివాదానికి తెరలేపారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం కొనసాతున్న నేపథ్యంలో మరోసారి శాంతి, భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని ముందే గ్రహించిన ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. హనుమాన్ చాలీసా పఠనంపై రాణా దంపతుల పట్టుదల, బీజేపీ నేత కిరీట్ సోమయ్య, మోహిత్ కంబోజ్‌లపై జరిగిన దాడుల కారణంగా పోలీసులపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. మత ఘర్షణలు, శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే వెంటనే నియంత్రించేందుకు ముంబై పోలీసులకు తోడుగా ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన 19 కంపెనీలను ముంబైలో నియోగించారు. వీరితోపాటు అల్లర్ల నియంత్రణ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, వివిధ దళాలకు చెందిన బలగాలను అప్రమత్తం చేశారు. -
తెలంగాణలో అమల్లోకి వచ్చిన కోవిడ్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్, మరో పక్క కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవ స్థలు, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఐఆర్ థర్మామీటర్/థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 2 వరకు రాష్ట్రంలో ఇలాంటి ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉండగా, తాజాగా ఈ నెల 10 వరకు ప్రభుత్వం వాటిని పొడిగించింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం సందర్భంగా కోవిడ్ పరిస్థితులను సమీక్షించిన అనంతరం సీఎస్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, కోవిడ్–19 కేసు లు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో సైతం ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బహిరంగ సభలకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో కోవిడ్ మార్గదర్శకాల అమలులో భాగంగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ శాసనసభ ఉపఎన్నికలకు అమలు చేసిన ఎన్నికల కోడ్ నిబంధనలే స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తాయన్నారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రచార సభల్లో 500 మందికి, వీధి సమావేశాల్లో 50 మందికి మించి అనుమతి ఉండదని చెప్పారు. రోడ్‌షోలకు అనుమతి లేదని, పాదయాత్ర, ఇతర ర్యాలీలకు సంబంధించి జిల్లా కలెక్టర్అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఊరేగింపులకు అనుమతి లేదని, అభ్యర్థులతో పాటు రెండు వాహనాలు, ఇద్దరు/ముగ్గురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్ కేంద్రం వద్ద అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు, ఎలక్షన్సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్పూర్తై ఉండాలని పేర్కొన్నారు. 9,835 మంది ఓటర్లు బ్యాలెట్ ద్వారా ప్రాధాన్యత ఓటు పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయని శశాంక్ గోయల్ తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. మొత్తం 12 స్థానాల్లో 9,835 మంది ఓటర్లు ఉన్నట్లు శశాంక్ గోయల్ తెలిపారు. ఆదిలాబాద్‌లో 931, వరంగల్ 1,021, నల్లగొండ 1,271, మెదక్ 1,015, నిజామాబాద్ 809, ఖమ్మం 769, కరీంనగర్ 1,323, మహబూబ్‌నగర్ 1,394, రంగారెడ్డిలో 1,302 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన చేస్తున్నామని, పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నా, గుర్తులకు బదులు అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని తెలిపారు. -
నేడు రాష్ట్రానికి యూపీ సీఎం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఆదివారం (7వ తేదీన) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగే పెద్దపల్లి నియోజకవర్గ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యా హ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిలో నిర్వహించే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభల్లో ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొననున్నారు. అలాగే కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కూడా ఆదివారం వివిధ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం శేరిలింగంపల్లిలో బీజేపీ చేవెళ్ల అభ్యర్థి బెక్కరి జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఐటీ ప్రొఫెషనల్స్ కార్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలో నిర్వహించే ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గద్వాలలో జరిగే బహిరంగసభలోనూ పాల్గొని మాట్లాడనున్నారు. -
అధినేతల అడుగులు
సాక్షి, వికారాబాద్: చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. పూడూరు మండలం మిర్జాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండాను రెపరెపలాడించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపుకోసం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. తాజాగా గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 8వ తేదీన వికారాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. రెండుపార్టీల అధినేతలు జిల్లాకు రానుండటంతో ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనియా, కేసీఆర్ రాకతో రాజకీయం మరింత వేడెక్కనుంది. మిర్జాపూర్‌లో ఏర్పాట్లు ఈనెల 7న పూడూరు మండలంలోని మిర్జాపూర్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత బట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రంలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే సభావేదిక వద్ద పనులు పూర్తయ్యాయి. చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలకు రూ.72 వేలు, సంక్షేమ పథకాలపై ఆమె ప్రసంగించనున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్, కేసీఆర్‌పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు లేకపోలేదు. 2 లక్షల మందితో సీఎం సభ సీఎం కేసీఆర్ సభ జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 8న కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాట్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ దళపతి గట్టి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్, పరిగి, తాండూరుతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో తన ప్రసంగంతో కేసీఆర్ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈనేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపై కేసీఆర్ ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల ప్రధాన ఎజెండా చేవెళ్ల పార్లమెంట్ పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. రెండు ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి రానుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మిషన్ భగీరథ తదితర పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయనే భరోసాలో టీఆర్ఎస్ ఉంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. సాగు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలతోపాటు అభివృద్ధి విషయమై హామీలు ఇవ్వనున్నారు. జోన్ అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అధినేతల ప్రసంగంలో ప్రధానంగా ఉండబోతుంది. ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఓట్లను దండిగా రాబట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. -
నేడు అమిత్ షా రాక
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో ఆయన కరీంనగర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం 11:40కి జరిగే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కి హన్మకొండలోని జేఎన్ఎం కాలేజీ గ్రౌండ్లో జరిగే వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో ప్రసంగిస్తారు. ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పాల్గొంటారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేట, విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. -
తెలుగు రాష్ట్రాల్లో నేడు అగ్రనేతల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అలాగే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ సోమవారం మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో జరిగే కాంగ్రెస్ ప్రచార సభలకు ఆయన హాజరవుతున్నారు. జహీరాబాద్ సభా వేదికగా పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను కూడా రాహుల్ వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని సభకు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు... హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకునే ఆయన 5 గంటలకు సభాస్థలికి వస్తారని, ఆయన ప్రసంగం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సభ కోసం భారీ ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సభ సాయంత్రం 4 గంటలకే ప్రారంభం కానుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర నాయకులు, ఆ తర్వాత లక్ష్మణ్, దత్తాత్రేయ, రాజాసింగ్, రాంచంద్రరావు, కిషన్‌రెడ్డి తదితరులు ప్రసంగించిన తర్వాత మోదీ సందేశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పర్యటన ఇలా... సోమవారం జరిగే మూడు బహిరంగ సభలకు హాజరయ్యేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి 8:40 నిమిషాలకు శంషాబాద్‌కు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతోపాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్‌లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా హోటల్‌కు చేరుకొని రాత్రి భోజనం అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. రాహుల్ బస ఏర్పాట్లను టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పర్యవేక్షించారు. టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ లోక్‌సభ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆదివారం రాత్రి హోటల్‌కు చేరుకొని రాహుల్‌ను కలిశారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్ జహీరాబాద్ బహిరంగ సభకు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి సైతం పాల్గొననున్నారు. జహీరాబాద్‌లో సభను ముగించుకొని మళ్లీ హెలికాప్టర్ ద్వారా రాహుల్ వనపర్తికి చేరుకుంటారు. అక్కడ 1:40 గంటలకు జరిగే బహిరంగ సభలో భట్టి విక్రమార్కతో కలసి పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారానే హుజూర్నగర్ సభకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉత్తమ్‌తో కలసి పాల్గొంటారు. సాయం త్రం 5:15కి అక్కడి నుంచి బయలుదేరి 5:50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రేపటి నుంచి కేసీఆర్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచింది. 16 లోక్‌సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. మార్చి 29న నల్లగొండ నుంచి ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన ఆవశ్యతను వివరిం చనున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్న నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచే కేసీఆర్ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నా రు. మొదటిరోజే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ మార్చి 17న కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 19న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రకటన, లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జీల నియామకం, ప్రచార సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తి చేసేందుకు 10 రోజులపాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం నుంచి పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఒకేరోజు రెండుమూడు లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచార సభలు నిర్వహించేలా కేసీఆర్ ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. ఇప్పటికే రెండు సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేశారు. మరో 13 సెగ్మెంట్లలో ప్రచార షెడ్యూల్‌ను శనివారం ఖరారు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రచారసభ నిర్వహణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ప్రచార సభల ఏర్పాట్లపై లోక్‌సభ ఇన్‌చార్జీలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ►మార్చి 29న సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల (కొంత భాగం) లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ►మార్చి 31న సాయంత్రం నాలుగు గంటలకు నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని వనపర్తి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్ బహిరంగ సభకు హాజరవుతారు. ►ఏప్రిల్ 1న సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్లోని రామగుండం సభలో పాల్గొంటారు. ►ఏప్రిల్ 2న సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటలకు భువనగిరి సభలో ప్రసంగిస్తారు. ►ఏప్రిల్ 3న సాయంత్రం నాలుగు గంటలకు అంథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరగనున్న జహీరాబాద్ సెగ్మెంట్ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటలకు నర్సాపూర్‌లో జరగనున్న మెదక్ లోక్‌సభ సెగ్మెంట్ ప్రచారసభలో పాల్గొంటారు. ►ఏప్రిల్ 4న సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ సభలో పాల్గొంటారు. ఐదున్నర గంటలకు ఖమ్మం బహిరంగ సభకు హాజరవుతారు. -
మూడుచోట్ల రాహుల్ సభలు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలను తీసుకువచ్చేలా టీపీసీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకలతో మొత్తం నాలుగు బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి వీరి షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలో అగ్రనేతల పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. రాహుల్ సభలను ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలుగా విభజించాలని, ఆయా ప్రాంతాల్లో ఒక్కో చోట సభ నిర్వహించాలని టీపీసీసీ నాయకత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసే నియోజకవర్గాలైన నల్లగొండ, మల్కాజ్గిరి, కరీంనగర్, భువనగిరిల్లో భారీసభల ఏర్పాటుకు వ్యూహాన్ని ఖరారు చేస్తున్నా రు. నల్లగొండ, మల్కాజ్గిరి, భువనగిరి, కరీంనగర్‌లలో 3 చోట్ల, వీలుకాని పక్షంలో కనీసం రెండు చోట్ల రాహుల్ పర్యటన ఖరారయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ప్రియాంక సభ కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్న చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని ఎంచుకుంటారనే చర్చ జరుగుతోంది. సాధ్యం కాని పక్షంలో ఖమ్మం లేదా హైదరాబాద్‌లలో ఆమె పాల్గొనే సభను ఖరారు చేయనున్నారు. -
సిరిసిల్ల: ప్రలోభాల పర్వం
జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మనీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఓటు లెక్కన ముట్టజెప్పడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటిసాయంత్రం నుంచి పోలింగ్ రోజువరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. దీంతో ముందస్తు వ్యూహంతో భారీ స్థాయిలో మద్యం నిల్వలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఉంచినా.. యంత్రాంగం కళ్లుగప్పి తమపని తాము చేసుకుపోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నట్లు సమాచారం. సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత మైకులు, ప్రచారాలు, ప్రసంగాలు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన బయటి వ్యక్తులు సైతం సాయంత్రానికల్లా నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రచారపర్వం తర్వాత, పోలింగ్ సమయానికి ముందున్న 48 గంటల పాటు జిల్లాలో ప్రలోభాల పర్వం జోరుగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరెండు రోజుల్లో చీకటిమాటున పెద్దఎత్తున ఓటర్లను డబ్బు, మద్యంతో ఎరవేసి ప్రలోభపర్చుకోవడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘా కళ్లు గప్పి.. జిల్లాలోని కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందస్తుగానే తమ నియోజవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండలస్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లకు ఎర.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జనసమీకరణలో మహిళలనే భారీసంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబ ట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదర్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గు ప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘా ల గ్రూపులకు ఒక్కో బృందానికి రూ.30 వేల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభ
-
8 సభల్లో కేసీఆర్ ప్రచారం