
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఆయన కరీంనగర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో ఉదయం 11:40కి జరిగే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కి హన్మకొండలోని జేఎన్‌ఎం కాలేజీ గ్రౌండ్‌లో జరిగే వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో ప్రసంగిస్తారు. ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పాల్గొంటారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేట, విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు.