సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహిరంగసభలతో హోరెత్తించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వచ్చే అకోబ్టర్ నెలలో 30 నుంచి 40 సభలు ఏర్పాటు చేసి పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనేలా ప్రణాళిక రచించింది. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లపాలనలో ప్రజల్లో పార్టీకి సానుకూలత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమైంది. 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల పరిధిలో సభల నిర్వహణ ద్వారా ‘కార్పెట్ బాంబింగ్’చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రజల మేలుకు తీసుకునే నిర్ణయాలు వివరించేందుకు సభల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడ్డాక...ఒకటొకటిగా ఈ సభల నిర్వహణ వేగం పెంచి ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి మొత్తం రాష్ట్రమంతా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
ప్రధాని మోదీ అక్టోబర్1న మహబూబ్‌నగర్ జిల్లాలో, 3న నిజామాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు, బహిరంగసభల ద్వారా రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. అక్టోబర్ 6న బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ. నడ్డా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆ రోజున జరిగే విస్తృతస్థాయి రాష్ట్రకౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేస్తారు. అక్టోబర్ 7న ఆదిలాబాద్‌లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సభ ఉండే అవకాశాలున్నాయని పార్టీ ్టవర్గాల సమాచారం.
కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం
కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర పదాధికారులు సీనియర్ నేతల సమావేశంలో జరిగింది. ఓబీసీ మోర్చా జాతీయఅధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, వివేక్‌వెంకటస్వామి, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు పాల్గొన్నారు.
సమావేశా నంతరం రాష్ట్ర ప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే వేలకోట్ల నిధులు కేటాయించిందని, మరిన్ని అభివృద్ధి పనుల నిమిత్తం అక్టోబర్ 1న మధ్యా్డహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్‌లో బహిరంగసభ, అక్టోబరు 3న మధ్యా హ్నం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సభ ఉంటుందని చెప్పారు.
ఈ పర్యటన సందర్భంగా మోదీ రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన పనులతో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులపై ప్రకటన చేస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పుకు ప్రయత్నం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment