కేంద్రంపై కన్నెర్ర | NGOs strike Central Offices Bandh Successful | Sakshi
Sakshi News home page

కేంద్రంపై కన్నెర్ర

Published Tue, Feb 11 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

NGOs   strike  Central Offices Bandh Successful

 ఏలూరు, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో తిరస్కరించాల్సిందేనని ఎన్జీవోలు డిమాండ్ చేశారు.  ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కళ్లెర్రజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమంలో భాగంగా ఎన్జీవోలు సోమవారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ విజయవంతమైంది. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడిలోని కేంద్ర కార్యాలయాలను ఎన్జీవోలు మూయించారు. ఏలూరు నగరంలో సెంట్రల్ ఎక్సైజ్, జూట్ మిల్లు వద్ద బీఎస్‌ఎన్‌ఎల్,
 
 వేంగి భవనం, ప్రధాన తపాలా కార్యాలయం, ఎల్‌ఐసీ, ఆర్‌ఆర్‌పేటలోని ఆదాయపుపన్ను శాఖ ఆఫీస్, యునైైటె డ్ ఇన్య్సూరెన్స్ తదితర కార్యాలయాలను ఎన్జీవో నేతలు ఆర్‌ఎస్ హ రనాథ్, ఎస్.సతీష్, నెరుసు రామారావు, కె.రమేష్‌కుమార్ మూయించేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌వీ సాగర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.సోమశేఖర్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్ కొద్దిసేపు ఆందోళన చేశారు. భీమవరంలో బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, రిజిస్ట్రేషన్, తహసిల్దార్, మునిసిపల్ కార్యాలయాలను ఎన్జీవో నేతలు మూయించారు. అనంతరం తాలూకాఆఫీస్ నుంచి ప్రకాశం చౌక్ వరకు ఎన్జీవోలు ర్యాలీ చేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
 
 పాలకొల్లులో ఏరియా ప్రభుత్వాసుపత్రిని ఎన్జీవోలు ముట్టడించి వైద్యాధికారులను అడ్డుకున్నారు. దీంతో అరగంటసేపు వైద్యసేవలు స్తంభించాయి. అనంతరం ఎన్జీవో నాయకులు గుడాల హరిబాబు, గారపాటి గోపాల్‌రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొవ్వూరులో పలు కేంద్ర కార్యాలయాలను ఎన్జీవోలు మాయించారు. చింతలపూడిలో పోస్టాఫీస్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు మూయించి స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి డిగ్రీ కళాశాల వరకు ఎన్జీవోలు 3కే రన్ నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఎల్‌ఐసీ, ఎఫ్‌సీఐ, హెడ్ పోస్టాఫీస్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలను మూయించి నిరసన తెలిపారు. తణుకులో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాన్ని మూసివేయించి పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement