తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా కేంద్రమాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఈ రోజు స్వామి వారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు దర్శనం అనంతరం ప్రముఖులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.