సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
శాసనసభ, శాసనమండలి ఆవరణలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సీమాంధ్రకు చెందిన కొంద రు ప్రజాప్రతినిధులు చింపివేయడంపై సోమవారం జిల్లా లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి పంపించిన తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చింపివేయడం అప్రజాస్వామిక చర్యగా తెలంగాణవాదులు అభివర్ణించా రు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చర్యను ఖండిస్తున్నామని ప్రకటించారు. పలుచోట్ల ఆందోళనలు చేశారు. ముసాయి దా బిల్లు ప్రతులను చింపిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాల ని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చర్యను నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ బస్‌స్టేషన్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లోనూ న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రపతి పంపించిన తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించివేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆర్మూర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, గాంధారి, బోధన్, డిచ్‌పల్లి, బాన్సువాడ, జుక్కల్, బాల్కొండ తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఆగదు
సోనియాగాంధీ ప్రకటించిన తర్వాత తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చింపివేయడం పిచ్చి చేష్ట. సత్వరమే శాసనసభ, శాసనమండలిలో తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాం. -ఆకుల లలిత, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
రాజ్యాంగ వ్యతిరేక చర్య
అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణ ముసాయిదా బిల్లును చింపివేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే. దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సీమాంధ్ర నాయకులు తమ ఆగడాలను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
-ఏఎస్ పోశెట్టి, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు
బిల్లు ప్రవేశ పెట్టడం హర్షణీయం
తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం హర్షణీయం. అయితే కొంతమంది సీమాం ధ్ర నేతలు ఈ బిల్లు ప్రతులను చింపివేయడం శోచనీయం. అది అప్రజాస్వామిక చర్య.
-వీజీ గౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
సీఎం ప్రోద్బలంతోనే..
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రోద్బలంతోనే సీమాంధ్ర నేతలు ముసాయిదా బిల్లు ప్రతులను చింపేశారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే విధంగా కేంద్రం కృషి చేయాలి.
-పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
సీమాంధ్ర ఎమ్మెల్యేలు కించపరిచారు
ముసాయిదా బిల్లును తొక్కడం ద్వారా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి చెందిన నాలుగున్నర కోట్లమంది మనోభావాలను కించపరిచారు. స్పీకర్ చొరవ చూపి ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందేలా చూడాలి.
-కంజర భూమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి
ఉద్యమం కొనసాగిస్తాం
రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్న సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టాలి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంత వరకు మేం ఉద్యమం కొనసాగిస్తాం. -యాదగిరి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
బిల్లు లొల్లిపై భగ్గుమన్న జిల్లా
Published Tue, Dec 17 2013 4:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement