
ఎవరినీ కలవని సీఎం, రాజీనామాపై అనుమానాలు!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.... ఈరోజు, రేపు అంటూ గత కొద్దిరోజులుగా ఫుకార్లు షికార్లు చేస్తున్నా ఆయన రాజీనామా విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కాగానే కిరణ్ రాజీనామా చేస్తారంటూ వార్తలు వెలువడినా... కిరణ్ మాత్రం ఇంతవరకూ రాజీనామాపై నోరు మెదపటం లేదు. అటు లోక్సభలో టీ.బిల్లుపై చర్చ ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించారు. చర్చకు స్పీకర్ మీరాకుమార్ కూడా అనుమతి ఇచ్చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రిని కలిసేందుకు మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారధి, అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు విజయప్రసాద్, యలమంచిలి రవి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారెవ్వరిని కిరణ్ కలవనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియదుగానీ కొత్త పార్టీ పెట్టడం తథ్యమని ఏరాసు అన్నారు