CM Kiran Resign
-
రాష్ట్రపతి పాలనవైపే కేంద్రం మొగ్గు
-
'కిరణ్ రాజీనామా దురదృష్టకరం'
-
'కిరణ్ రాజీనామా కాంగ్రెస్ గేమ్‌ప్లాన్‌లో భాగం'
-
'బాల్స్ అన్నీ ఆడి డకౌట్ అయిన కిరణ్'
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ బుధవారం విజయవాడలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాల్స్ అన్నీ ఆడి డకౌట్ అయిన కిరణ్ ఎవరిని ఉద్దరించటాని ఇప్పుడు రాజీనామా చేస్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు, కిరణ్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని జోగి రమేష్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్ని మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించి తెలుగు ప్రజలను చీల్చారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలను నిట్టనిలువును చీల్చిన కాంగ్రెస్-బీజేపీలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహకరించారని ఆరోపించారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలు మోసం చేశారన్నారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు చీము, నెత్తురు ఉంటే చంద్రబాబును ఛీకొట్టాలని జోగి రమేష్ ఈ సందర్భంగా సూచించారు. చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించలేకపోవటం సిగ్గు చేటు ఆయన పేర్కొన్నారు. బాబును నమ్మకోవద్దని... రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో ఓ కన్ను...సీమాంధ్రలో ఇంకో కన్నుపోయిందని ... అటువంటి చంద్రబాబును నమ్ముకోవద్దని ఆ పార్టీ నేతలకు జోగి రమేష్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం సీమాంధ్ర బంద్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బుధవారం విజయవాడలో సీమాంధ్ర బంద్‌లో జోగి రమేష్ పాల్గొని రాష్ట్ర విభజన చేసిన కేంద్ర ప్రభుత్వంతోపాటు అందుకు సహకరించిన కిరణ్, ప్రతిపక్ష నేతలు చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. -
ఎవరినీ కలవని సీఎం, రాజీనామాపై అనుమానాలు!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.... ఈరోజు, రేపు అంటూ గత కొద్దిరోజులుగా ఫుకార్లు షికార్లు చేస్తున్నా ఆయన రాజీనామా విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కాగానే కిరణ్ రాజీనామా చేస్తారంటూ వార్తలు వెలువడినా... కిరణ్ మాత్రం ఇంతవరకూ రాజీనామాపై నోరు మెదపటం లేదు. అటు లోక్‌సభలో టీ.బిల్లుపై చర్చ ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించారు. చర్చకు స్పీకర్ మీరాకుమార్ కూడా అనుమతి ఇచ్చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిని కలిసేందుకు మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారధి, అహ్మదుల్లా, ఎమ్మెల్యేలు విజయప్రసాద్, యలమంచిలి రవి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అయితే వారెవ్వరిని కిరణ్ కలవనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియదుగానీ కొత్త పార్టీ పెట్టడం తథ్యమని ఏరాసు అన్నారు -
కిరణ్ కచ్చితంగా పార్టీ పెడతారు: ఏరాసు
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరముందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా కొత్త పార్టీ పెడతారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం సీఎం కిరణ్‌తో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఏరాసు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రోజున సీఎం రాజీనామా చేస్తారని చెప్పారు. తమ జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటామని ఏరాసు తెలిపారు. తాము ఏపార్టీలో ఉంటామన్నది త్వరలోనే తేలుస్తుందన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని మరో మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు సంకేతాలు పోతాయన్న భావనతో సీఎం వెనక్కు తగ్గారని వెల్లడించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అంటున్నాయని టీజీ చెప్పారు.