చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటా:ఈదర హరిబాబు | no one can suspended me, says edara hari babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటా:ఈదర హరిబాబు

Published Mon, Jul 14 2014 7:01 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటా:ఈదర హరిబాబు - Sakshi

చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటా:ఈదర హరిబాబు

ఒంగోలు:టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడుచుకుంటానని ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన ఈదర హరిబాబు స్పష్టం చేశారు. పార్టీలో కొంతమంది తనను చంద్రబాబు నుంచి దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన హరిబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్మూ ధైర్యం జిల్లాలో ఎవ్వరికీ లేదన్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి నిజమైన వారసుడిని తానేనని తెలిపారు. తన చర్యల వల్ల టీడీపీ ఏనాడు నష్టపోలేదని హరిబాబు అభిప్రాయపడ్డారు.

 

పార్టీలో కొంతమంది పనిగట్టుకుని అణగదొక్కాలని చూశారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకే నడుచుకుంటానని, ఒక వేళ రాజీనామా చేయమని బాబు ఆదేశిస్తే తప్పకుండా చేస్తానన్నారు.  ఆదివారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈదర హరిబాబు ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement