
'సీమాంధ్రులు వ్యతిరేకించినా ఫలితం ఉండదు'
హైదరాబాద్: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇష్టప్రకారం జరిగే విభజన అయినందున ఇది ఆగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఉపయోగం లేదని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అవసరం లేదన్నారు.
కొత్త రాజధాని ఏర్పరుచుకుని అక్కడి నుంచే సీమాంధ్ర పాలన సాగించాలన్న అభిప్రాయాన్ని జెసి వ్యక్తం చేశారు. పార్లమెంట్, కోర్టులు విభజనను అడ్డుకుంటాయనే ఆశలేదన్నారు.