కొట్టుకుపోయిన షట్టర్లు... పూడుకు పోయిన కాలువలతో ఆనకట్టల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో రైతన్న కంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఖరీఫ్‌కు చుక్కనీరైనా వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాము ఎలా సాగు చేయాలని, ఇప్పటి వరకూ చేసిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
బొబ్బిలి: పార్వతీపురం డివిజన్‌లోని ఏ ఆనకట్ట, ప్రాజెక్టును చూసినా దయనీయంగా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్ సాగునీరందే అవకాశం ఏ కోశానా కనిపించడంలేదు. గత ఏడాది అక్టోబరులో వచ్చిన తుపాను వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ మూలకు చే రాయి. వాటికి ఈ వేసవి కాలంలో మరమ్మతులు చేస్తేనే ఖరీఫ్ సీజనుకు నీరును ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పటివరకూ అటువంటి పరిస్థితులు కనిపించకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. సీతానగరం, పారాది ఆనకట్టలకు వెంటనే షట్టర్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే నీరు కూడా నిల్వ ఉండదు. సీతానగరం ఆనకట్ట పరిధిలో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి సంబంధించి మూడు షట్టర్లు తుపాను దెబ్బకు పాడైపోయాయి. వాటిని సరిచేయడానికి కూడా ఆస్కారం లేదు.
వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రూ.20 లక్షలతోప్రతిపాదనలు పంపారు. అలాగే రామభద్రపురం మండలం రొంపల్లి వద్ద ఉన్న పారాది ఆనకట్ట పరిస్థితి కూడా అలాగే ఉంది. దీన్ని నుంచి బొ బ్బిలి, బాడంగి మండలాల్లో 7,218 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎడ మ కాలువ ద్వారా 4,176 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 3,042 ఎకరాలకు సా గునీరు అందుతుంది. వేగావతి నది ఆనకట్టలో దాదాపు 50 షట్టర్లు ద్వారా సా గునీటికి అడ్డుకట్టవేసి కుడి, ఎడమల కాలువ ద్వారా పంపిస్తారు. అయితే ఆనకట్టకు ఉన్న దాదాపు అన్ని షట్టర్లు వరద నీటికి కొట్టుకుపోయాయి. ఇప్పుడు వీటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపారు.
అనుమతులు, డిజైన్ వస్తేనే.. : గతంలో శ్రీకాకుళం జిల్లాలో షట్టర్ల కుంభకోణం జరిగిన తరువాత ఇప్పుడు వీటి ఏర్పాటుపై నీటిపారుదల శాఖాధికారులు నిశితంగా పరిశీస్తున్నారు. విజ యవాడ సమీపాన ఉన్న సీతానగరంలో గల నీటిపారుదలశాఖ మెకానికల్ డివిజన్ అధికారులు అనుమతించిన షట్టర్లను మాత్రమే ఏర్పాటు చేయాలి. అక్కడ నుంచి అనుమతి, డిజైన్ వస్తేగాని ఇక్కడ షట్టర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ రెండు ఆనకట్టలకు ఇంత తొందరగా అనుమతులు లభించి, టెండర్లు పూర్తయి పనులు జరుగుతాయన్న ఆశ అన్నదాతల్లో కనిపిం చడం లేదు.. చెంతనే నీళ్లున్నా.. : నారాయణప్పవలస వద్ద ఉన్న కంచరగెడ్డ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జలాశయం నిర్మాణం పూర్తయినా, ఇప్పటి వరకూ కాలువలు నిర్మించలేదు. దీంతో కళ్లెదురుగా నీళ్లున్నా పంట పోలాలకు చేరే అవకాశం లే క దాదాపు 700 ఎకరాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెం డు వైపులా కాలువ నిర్మాణానికి రూ.కోటీ 20 లక్షలతో ప్రతిపాదనలు పం పినా అవి మంజూరుకు నోచుకోలేదు.. ఇక వెంగళరాయసాగర్ ఆనకట్ట ఆదనపు జలాలు పరిస్థితి కూడా అలాగే ఉంది. రూ. 11 కోట్ల మంజూరైనా ఇప్పటివరకూ రూ. 30 లక్షల విలువైన పనులనే నిర్వహించారు. భైరవసాగరం వద్ద, కలవరాయి, వాకాడవలస గ్రామాల మధ్య కాలువల నిర్మాణం ప్రారంభించినా అవి ఎప్పటికి పూర్తవుతాయో అంతుపట్టని పరిస్థితి. కాాంట్రాక్టర్లు దీనిపై శ్రద్ధ చూపకపోవడం, సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడానికి రంగంలోనికి దిగడం వంటి సమస్యల వల్ల ఈ జాప్యం ఏర్పడింది. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పక్క నుంచి వయోడెక్ట్ నిర్మాణం చేయాల్సి ఉంది. దానికి భూసేకరణ సమస్య కూడా ఏర్పడింది. దాదాపు ఐదు వేల ఎకరాలకు అందాల్సిన అదనపు జలాలు ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాగే చిత్రకోట బోడ్డవలస వద్ద జలాశయం ఉందన్న సంగతిని కూడా ఇరిగేషన్ అధికారులు మరిచిపోయినట్టున్నారు.. ఈ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి వినియోగంలోకి రాకుండా పడి ఉంది..
ఖరీఫ్‌కు నీరెలా ?
Published Sun, Feb 22 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement