సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీలలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజూ కూడా మందకొడిగానే సాగింది. భారీ సంఖ్యలో నామినేషన్ ఫారాలు అమ్ముడు పోయినా రెండంకెల సంఖ్య మించలేదు. ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీల్లో ఒక్కో మున్సిపాలిటీలో ఏడు
నామినేషన్ల చొప్పున రెండింటిలో 14 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగజ్‌నగర్‌లో ఒకటి, బెల్లంపల్లిలో రెండు, మంచిర్యాలలో ఆరు దాఖలు అయ్యాయి. భైంసాలో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఇప్పటివరకు 598 దరఖాస్తు ఫారాలు అమ్ముడయ్యాయి. వీటిలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 230 అమ్ముడుపోగా, బెల్లంపల్లిలో 105 అమ్ముడయ్యాయి. బుధవారం నామినేషన్లు అత్యధికంగా దాఖలు అయ్యే అవకాశం ఉంది. కొన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి రాగా, మరికొన్ని పార్టీల్లో కొలిక్కి రాకపోవడంతో నామినేషన్ల దాఖలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
అసంతృప్తుల బెడద
అన్ని పార్టీలు బీ-ఫారాలు అందించేందుకు ప్రక్రియ సిద్ధం చేసుకున్నాయి. అయితే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, బీ-ఫారాలు అందించే ప్రక్రియను ముగిస్తే అసంతృప్తుల బెడద ఎదురయ్యే ప్రమాదం ఉందని పార్టీలు కలవరపడుతున్నాయి. అందుకే అభ్యర్థులుగా ఎవరిని బరిలో దింపుతున్నామనే విషయాన్ని ప్రకటించేందుకు ఆయా వర్గాలు సమయం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో జరుగుతున్న కాంగ్రెస్ ైెహ కమాండ్ తుది నిర్ణయం వెలువడకపోవడం ఆ పార్టీ ఆశావహులకు బీ-ఫారాలు అందజేయటంలో జరుగుతున్న కారణానికి ఒక కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును తుది దశకు తీసుకువచ్చింది. టీడీపీ, టీఆర్‌ఎస్‌లలో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు ఆయా పార్టీల శ్రేణులు వెల్లడించాయి. ఇదిలా ఉండగా పురపాలక ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీ నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి కావడంతో నాయకులు ఆ పత్రాలు తీసుకునే పనిలో పడ్డారు. ఈ నిబంధన వల్ల గతంలో ఉన్న బకాయిలు చెల్లించేందుకు నాయకులు ఆసక్తి చూపించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సొమ్ము చేరుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
రెండో రోజూ అదే తీరు
Published Wed, Mar 12 2014 2:34 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement