విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించకుంటే ఈనెల 14న ఇక్కడ జరగనున్న భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ ను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీయిచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
భారత్-విండీస్ మూడో వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఆందోళనకారులు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అ భిమానులు ఆందోళన చెందుతున్నారు.
'భారత్-విండీస్ వన్డేను అడ్డుకుంటాం'
Published Wed, Oct 8 2014 4:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement